గురుకుల అవుట్సోర్సింగ్ అధ్యాపకులు ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి:పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు
స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,నవంబర్ 23: గురుకులాల్లో పని చేసే అధ్యాపకులు ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు డిమాండ్ చేశారు.శనివారం పాడేరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో శాసన సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి గురుకుల పాఠశాల మరియు కళాశాలల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు మరియు అధ్యాపకులు గా పనిచేస్తున్న ఉద్యోగులు గత ఎనిమిది రోజులుగా ఐటీడీఏ లో చేపడుతున్న నిరాహారదీక్షకు కనీసం ప్రభుత్వం స్పందించడం లేదని ఎమ్మెల్యే మండిపడ్డారు.ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో తొమ్మిది గిరిజన గురుకుల పాఠశాలలు మరియు ఎనిమిది గిరిజన గురుకుల కళాశాలలు ఉండగా మొత్తం 4000 మంది విద్యార్థులు ఉన్నారు. గత వారం రోజులుగా ఉపాధ్యాయులు వారియొక్క డిమాండ్ లపై చేస్తున్నా రీలే నిరాహార దీక్షలు చేపట్టడం ద్వారా విద్యార్థులకు విధ్యబోధనలు లేకపోవడంతో చదువుకి దూరం అవుతున్నారు. కావున ప్రభుత్వం ఉపాధ్యాయులు చేపడుతున్న న్యాయపరమైన డిమాండ్స్ లకు ప్రభుత్వం చొరవతీసుకుని వారి యొక్క సమస్యలు పరిష్కరించి విద్యార్థులకు విద్యను అందించే విధంగా చొరవ తీసుకోవాలని ప్రభుత్వనికి కోరారు.అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు అందరికీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా తీసుకుని వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు
.
స్టాప్ రిపోర్టర్ మాదిరి చంటిబాబు
About The Author
అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.