గంగవరం, పెన్ పవర్, ఫిబ్రవరి 15:
మురుగునీరు నిల్వ ఉండకుండా ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసుకోవాలని ఎంపీడీవో వై లక్ష్మణరావు సూచించారు. శనివారం గంగవరంలో సర్పంచ్ కలుముల అక్కమ్మ ఇంటి ఆవరణలో ఉపాధి హామీ పథకంలో భాగంగా వ్యక్తిగత ఇంకుడు గుంట నిర్మాణ పనులను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. వ్యక్తిగత ఇంకుడు గుంతల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఎపిఓ ప్రకాష్ ,పంచాయతీ కార్యదర్శి కృష్ణస్వామి కృష్ణస్వామి, టెక్నికల్ అసిస్టెంట్ బాల శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.