గూడెం కొత్తవీధి,పెన్ పవర్,మార్చ్ 27: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలో గల 16 పంచాయతీల పేసా కమిటీ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు మండల కేంద్రంలో గల వెలుగు సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. సమావేశంలో మండల కార్యవర్గమును అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షునిగా గొర్లె వీర వెంకట్, మండల పేసా అధ్యక్షునిగా కొర్ర బలరాం, ఉపాధ్యక్షులుగా కొర్ర భూపతి, కొర్ర మార్కు రాజు, ప్రధాన కార్యదర్శిగా మాదిరి చంటిబాబు,కోశాధికారిగా లకే రామచంద్రుడులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే కార్యదర్శులుగా గబులంగి గణేష్,మొట్టడం రాంబాబు,చిక్కుడు అశోక్,కిల్లో ధర్మారావులను ఎన్నుకున్నారు.అనంతరం 16 మంది వర్కింగ్ కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా మండల పేసా అధ్యక్షుడు బలరాం మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి మండల పేసా కార్యవర్గం గిరిజన హక్కులు చట్టాల పరిరక్షణకై అంతఃకరణ శుద్ధితో పనిచేయాలని తెలిపారు.