వరద ఉధృతిలో వ్యక్తిని కాపాడిన ఎమ్మెల్యే మత్స్య రస విశ్వేశ్వర రాజు... రియల్ హీరో అంటూ పలువురు అభినందనలు  

స్టాఫ్ రిపోర్టర్,పాడేరు,గూడెం కొత్తవీధి,పెన్ పవర్,సెప్టెంబర్ 8,అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం రాయి గడ్డ వాగు ఉధృతిగా ప్రవహించి ఆ ప్రాంతంలో రాకపోకలు నిలి చిపోయాయని పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజుకు సమాచారం అందడంతో ఆదివారం ఆ వాగు పరిశీలనకు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు వెళ్లారు.అయితే అదే సమయంలో ఆ వాగు దాటడానికి ప్రయత్నించిన యు వకుడు ఒకరు వాగు మధ్యలో చిక్కుకుపోవడంతో ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రాజు సాహసించి వాగులోకి వెళ్లి ఆ యువకుడ్ని సురక్షితంగా రక్షించడం జరిగింది.తనకు ఈత అలవాటు ఉండటం వలన వేగంగా వెళ్లి ఆ యువకుడిని రక్షించానని ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు తెలిపారు. కాగా ఒక ఎమ్మెల్యే ఇటువంటి సాహస కార్యాన్ని చేపట్టడం పట్ల పలువురు అభినందిస్తున్నారు. పాడేరు ఎమ్మెల్యే మనసున్న మహారాజు.. రియల్ హీరో అంటూ పలువురు అభినందనలు తెలుపుతున్నారు.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.