సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలి

స్టాఫ్ రిపోర్టర్,పాడేరు/ చింతపల్లి/పెన్ పవర్,జూలై 23:అల్లూరి సీతారామరాజు జిల్లా లో భారీ వర్షలు కారణం గా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో సీజనల్ వారిగా వచ్చే వ్యాధులు మలేరియా,టైపాయిడ్, డెంగ్యూ, చర్మ వ్యాధులు  వ్యాపించే ప్రమాదం ఉంది అని కరాటే అసోసియేషన్ స్టూడెంట్స్ కోఫుకాన్ కరాటే క్లబ్ చీఫ్.ఇన్ స్ట్రక్టర్.ఎగ్జామినార్ బాకూరు పాండు రాజు తెలిపారు.ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ  ఈ సమస్య పైనా  జిల్లా వైద్య అధికారి వారికి తెలియజేయడమైది. 

జిల్లా మండలల పరిధిలోని  గ్రామాలలో పనిచేస్తున్న ఆశ వర్కర్లు,ఏఎన్ ఎం ,హెల్త్ సూపర్వేజర్లు కు  స్థానిక డాక్టర్స్ అవగాహనా కలిపించాలి.
పంచాయతీ పరిధిలో గ్రామల్లో బ్లిసింగ్ పౌడర్,వాటర్ ట్యాంకులు క్లినింగ్, పరిసరాలు పరిశుభ్రత  పైనా మండలల పరిధి వైద్య అధికారులు గిరిజన గ్రామంలొ పర్యవేక్షణ చేసి సీజనల్ వారి వొచ్చే వ్యాధులు వ్యాపించకుండా తీసుకునే జాగ్రత్త లు వైద్య సిబ్బంది ద్వారా అవగాహనా కలిపించాలి అని కరాటే చీఫ్.ఇన్ స్ట్రక్టర్. ఎగ్జామినార్ బాకూరు పాండు రాజు తెలిపారు.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.