స్టాప్ రిపోర్టర్:పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగస్టు 19: కైలాస పట్నం అనాధ ఆశ్రయంలో జరిగిన సంఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలగ చేసిందని పాడేరు ఎమ్మెల్యే ఎం విశ్వేశ్వర రాజు పేర్కొన్నారు.అనకాపల్లి జిల్లా కైలాసపట్నం అనాథ ఆశ్రమం పాఠశాల విద్యార్థులు ఆదివారం రాత్రి కలుషిత ఆహారం తిని నలుగురు విద్యార్థులు మృతి చెందగా మరో 27 మంది విద్యార్థులకు అస్వస్థత గురయ్యారు.జరిగిన విషయం తెలుసుకున్న పాడేరు శాసన సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు హుటా హుటినా చింతపల్లి హాస్పిటల్ లో చేరుకుని మరణించిన చిన్నారులు కుటుంబ సభ్యులకు పరామర్శించి ఆర్థిక సాయం అందించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మృతులు కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని కోరారు.జరిగిన ఘటనపై అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు అధికారులతో మాట్లాడి అస్వస్థత గురైనా 27 మంది విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో గూడెం కొత్తవీధి మండల పార్టీ అధ్యక్షులు బొబ్బిలి లక్ష్మణ్, రాష్ట్ర కార్యదర్శి జల్లి సుధాకర్, సీనియర్ నాయకులు బుసారి క్రిష్ణ రావు, గంగన్న పడాల్, గిరి ప్రసాద్, హేమంత్, తదితరులు పాల్గొన్నారు.