విద్యుత్ షాక్ తగిలి తల్లి బిడ్డలు.. ముగ్గురు మృతి
స్టాప్ రిపోర్టర్,పాడేరు/పెదబయలు,పెన్ పవర్ డిసెంబర్ 9: అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం మారుముల కిముడుపల్లి పంచాయతీ కి చెందిన గడుగుపల్లి గ్రామంలో పి.వి.టిజి కులానికి చెందిన ఆదివాసీ కుటుంబంలో విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు మృతిచెందారు.సోమవారం సాయంత్రం వ్యవసాయ పనులకు వెళ్లి ఇంటికి చేరుకొన్న తరువాత ఉతికిన బట్టలు అరినవి తీయడానికి కుమారుడు కొర్ర.సంతోష్( 13) బట్టలు తీయబోగా విద్యుత్ వైర్లు అనుకోనిఉన్నాయని తేలిక ముట్టుకోన్నాడని కుమారుడు అరుపులు విని తల్లి అయినా కొర్ర.లక్ష్మి(36) కుమారుని రక్షించాబోయి పట్టుకొన్నాదని అదేవిదంగా సమీపంలో గల కూతురు కోర్ర.అంజలి(10) కి విద్యుత్ వైర్లు తగలడం తో ముగ్గురు షాక్ తగిలి అక్కడి కక్కడే మరణించినట్లు గ్రామస్థులు తెలిపినట్లు ఎస్.ఐ కె.రమణ తెలిపారు.మృతులను పాడేరు ఏరియా హాస్పిటల్ కి తరలించి మార్చురిలో ఉంచడం జరిగిందని మంగళవారం పంచనామా అనంతరం తదుపరి చర్యలుంటాయని తెలిపారు.
About The Author
అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.