స్టాఫ్ రిపోర్టర్ పాడేరు/గూడెం కొత్త వీధి,పెన్ పవర్,జులై 10 : విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో బుధవారం అఖిలభారత బిఎస్ఎన్ఎల్ డిఓటి పెన్షనర్స్ అసోసియేషన్ ఐదవ మహాసభ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అరకు పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ గుమ్మ తనూజ రాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పూలదండ వేసి జ్ఞాపిక అందజేసి దుస్సాలువతో సన్మానించారు. పెండింగ్లో ఉన్న అదనపు ఇంక్రిమెంట్ లేకుండా 78.2% పెన్షన్ రివిజన్ తుది పరిష్కారం కొరకు కృషి చేయాలని పెన్షనర్లు ఎంపీ తనూజ రాణికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మా తండ్రి బిఎస్ఎన్ఎల్ శాఖ ఉద్యోగిగా ఉంటూ మాకు ఆదర్శవంతులుగా తీర్చిదిద్దారని మీ యొక్క అసోసియేషన్ సమస్యల కొరకు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం వి ఎస్ శర్మ, ఐ టి ఎస్ ప్రిన్సిపాల్ జిఎం,పాల్ విలియమ్స్, ఐ టి ఎస్ ప్రిన్సిపాల్ జిఎం పి ఆడమ్స్, కె ఎస్ సి బోస్, చంద్రశేఖర్, అసోసియేషన్ కమిటీ సభ్యుడు ఎంపీ తండ్రి గుమ్మ శ్యాంసుందర్ రావు, అసోసియేషన్ కమిటీ సభ్యులు ఆఫీస్ బేరర్లు,సర్కిల్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.