👉🏻ప్రతి గ్రామపంచాయతీలోనూ అన్ని రికార్డులు అమలు చేయాలి
గూడెం కొత్తవీధి,పెన్ పవర్,నవంబర్25:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలోని అన్ని సచివాలయాల సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని లేదంటే చర్యలు తీసుకోవడం జరుగుతుందని గూడెం కొత్తవీధి మండల అభివృద్ధి అధికారి ఉమామహేశ్వరరావు తెలిపారు.గూడెం కొత్తవీధి మండలంలోని సంకడా,రింతాడ గ్రామ సచివాలయాలను ఆయన తనిఖీ చేశారు.ప్రతి సచివాలయంలోనూ తప్పనిసరిగా ఎన్పీసీఎల్ హౌస్ జియో ట్యాకింగ్ మ్యాపింగ్ సర్వే కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు పంచాయతీ మరియు సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా కార్యాలయ సమయాలలో అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించారు.