స్టాప్ రిపోర్టార్,పాడేరు/గూడెం కొత్త వీధి పెన్ పవర్,జూలై 17: ఈ నెల 19వ తేదీ శుక్రవారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు (ప్రభుత్వ కార్యదర్శి కేడర్)జతోతు హుస్సేన్ జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ తెలిపారు.కమిషన్ సభ్యులు ఆరోజు ఉదయం10 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి రోడ్డు మార్గంలో పాడేరు చేరుకుంటారు.పాడేరు గిరిజన భవన్ లో అన్ని ఆదివాసీ సంఘాల ప్రతినిధులతో పరస్పరం చర్చిస్తారు.అనంతరం 11 గంటలకు జిల్లా కలెక్టర్,ఎస్పీ, ఐటీడీఏ పీవో,జిల్లా అధికారులతో నిర్వహించనున్న సమావేశంలో పాల్గొంటారు.మధ్యాహ్నం రెండు గంటలకు అరకు వ్యాలీ సందర్శనకు బయలుదేరి వెళ్తారు. సాయంత్రం ఐదు గంటలకు హరిత హోటల్ గోష్టి సమావేశ మందిరంలో ఏపీ టూరిజం కార్పొరేషన్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహిస్తారు.అనంతరం విశాఖపట్నం బయలుదేరి వెళ్తారు అని జిల్లా కలెక్టర్ వివరించారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు పర్యటన 19వ తారీఖున ఉండటం వలన ఆరోజు నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మీకోసం కార్యక్రమంలో వినతులు అందించటానికి వచ్చే ప్రజలు ఆరోజు రావద్దు అని కలెక్టర్ సూచించారు.