సీతారాముల కళ్యాణం కోసం పందిరి ముహూర్తపురాట 

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 3: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధిలో ఈ నెల 6న జరిగే సీతారాముల కల్యాణం కోసం పందిరి ముహూర్తపు రాట కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.శ్రీరామ నవమి సందర్భంగా ప్రతీ ఏటా నిర్వహించే సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించేందుకు స్థానిక ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.సంప్రదాయ బద్దంగా ఊరేగింపు నిర్వహించి కళ్యాణం జరిపించనున్నారు. నాలుగు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గొర్లె వీరవెంకట్, గౌరవ అధ్యక్షురాలు,ఎంపీటీసీ రీమల రాజేశ్వరీ,సమరస్యత సేవా ఫౌండేషన్ జిల్లా సహాయ మహిళా కన్వీనర్ కొక్కుల లావణ్య,తెదేపా మండల అధ్యక్షుడు ముక్కలి రమేష్, కమిటీ ప్రతినిధులు శోభన్, సురకత్తి రాము,నాడేల రాజారత్నం, బత్తుల రాజు తదితరులు పాల్గొన్నారు.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.