రూ.1005 కోట్లతో
1069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
గిరిజన గ్రామాలకు అంబులెన్స్ చేరుతున్నాయి
స్టాప్ రిపోర్టర్, డుంబ్రిగూడ /అరకు వ్యాలీ/గూడెం కొత్తవీధి, పెన్ పవర్, ఏప్రిల్ 7:మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మిస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, గ్రామీణాభివృద్ధి గ్రామీణ అభివృద్ధి, పర్యావరణ అటవీ శాఖ మాత్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం డంబ్రిగూడ మండలం చాపరాయి గెడ్డ నుండి కాలినడకన రెండు కిలోమీటర్లు ప్రయాణించి పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామానికి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం డుంబ్రిగూడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమం పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రోడ్ల గురించి మళ్లీ వస్తానని చెప్పి మాట నిల బెట్టుకుని గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని అడిగిన 24 గంటల్లో రహదారుల నిర్మాణానికి రూ.49 కోట్లు మంజూరు చేశారని చెప్పారు
అడవి తల్లిని నమ్ముకుంటే బువ్వ జీవనాధారం లభిస్తుందన్నారు. ప్రకృతి అడవి మీద అపారమైన ఇష్టం ఉందని స్పష్టం చేశారు. ఏజెన్సీలో పర్యటిస్తుంటే అందమైన కాఫీ తోటలు మిరియాల పంట, కటిక జలపాతం ఆహ్లాదకరంగా ఉన్నాయన్నారు. ప్రకృతి అడవి మీద అపారమైన ఇష్టమని పేర్కొన్నారు. టూరిజం అభివృద్ధి చెందితే గిరిజనుల జీవనశైలి మెరుగు పడుతుందన్నారు. గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి చాలా తేడా ఉంది అన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో 90 కిలోమీటర్లు రోడ్లు నిర్మాణానికి రూ 92 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలలలో రూ.1005 కోట్ల వేగంతో 10 69 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఓట్లు వేయకపోయినా పివిటిజి గ్రామాల అభివృద్ధికి రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ప్రధానమంత్రి జన్ మన్ పథకంలో రూ.555.61 కోట్ల వ్యయంతో 612.72 కిలోమీటర్ల రోడ్ల ను నిర్మిస్తున్నామని చెప్పారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రూ.399.66 కోట్ల వ్యయంతో 471.63 కిలోమీటర్ల రహదారులను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ కింద రు 49.73 కోట్లతో 48.85 కిలోమీటర్ల రోడ్లను నిర్మించడం జరుగుతుందని చెప్పారు.615 గ్రామాలకు రహదారి సదుపాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. డోలిమో తలకు విముక్తి కలుగుతుందని చెప్పారు. గిరిజనుల కష్టాల్లో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి, పర్యాటకశాఖ మంత్రులతో మాట్లాడి పర్యాటక అభివృద్ధిని చేస్తామన్నారు. చాపరాయి గెడ్డ పై వంతెన నిర్మాణానికి కొంత సమయం ఇస్తే పర్యావరణానికి, టూరిజనికి ఇబ్బంది లేకుండా వంతెన నిర్మిస్తామని చెప్పారు
వంతెన నిర్మాణానికి అందమైన పరిష్కారం చూపిస్తామన్నారు. యువత టూరిజం వైపు ఆకర్షితుల అవ్వాలని చెప్పారు. గంజాయి వంటి మాద కద్రవ్యాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. ఉపాది హామీ పథకంలో అనుసంధానం చేస్తూ ఏజెన్సీలో లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరణకు చర్యలు చేపట్టా మన్నారు. నీడ తోటల పెంపకానికి సిల్వర్ ఓక్ కి ప్రత్యామ్నాయంగా పనస, మామిడి, నేరేడు మొక్కలను పెంచాలని సూచించారు. పేద పాడు గ్రామానికి 12 పనులను మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. పెదపాడు పాఠశాలలో వి భాషలో మాట్లాడానని అన్నారు. గిరిజనుల దింసా నృత్యం ఆకట్టుకుందని చెప్పారు.
బస్తర్ అటవీ ప్రాంతం నుండి చెడుపులు చిల్లంగులు పెట్టేవారు వచ్చారని 9 మందిని చంపడం జరిగిందన్నారు. అటువంటి మూఢనమ్మకాలను నమ్మకూడదని ఉద్రేకానికి లోనై చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని సూచించారు. గిరిజన సంక్షేమ శాఖ, పోలీస్ రెవెన్యూ వైద్యారోగ్య శాఖ అధికారులకు సమాచారం అందించాలని చెప్పారు. వికాస్ కార్యక్రమాన్ని అమలు చేసి మూఢనమ్మకాలపై గిరిజనులను చైతన్యవంతం చేస్తామని చెప్పారు. చిల్లంగులు చెడుపులు చేశారని భావించకుండా మానసికంగా అనారకంగా ఉన్నప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని సూచించారు. అడవులకు , అటవీ ప్రాంతాలకు చిచ్చుపెట్టి అడవులకు మంట పెట్టడం వలన పర్యావరణానికి హాని కలుగుతుందని చెప్పారు. మూగజీవాలు , జంతువులు మృత్యువాత పడతాయని అన్నారు. మీరు ఆశీస్సులు అందించి రానున్న 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో ఉంచాలని కోరారు. 15 సంవత్సరాలు మీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పారు. చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముఖ్యమంత్రి సరిచేస్తున్నారని చెప్పారు.
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాలో 20 కోట్ల వ్యయంతో 30 మల్టీ పర్పస్ సెంటర్లను మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. గిరిజన ప్రాంతంలో రహదారుల నిర్మాణానికి అటవీ శాఖ అధికారులు అడ్డంకులు తొలగించాలని ఉప ముఖ్యమంత్రిని కోరారు. రాష్ట్రంలో రూ.75 కోట్ల వేగంతో 125 మల్టీపర్పస్ భవనాలను నిర్మిస్తున్నామని చెప్పారు.
జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రెండోసారి ఏజెన్సీలో పర్యటించి పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామంలో స్వయంగా పర్యటించి సమస్యలు విని పరిష్కారం చేశారని అన్నారు. జిల్లాలోని 5020 గ్రామాలలో 1500 గ్రామాలకు రహదారులు సౌకర్యాలు లేవన్నారు . పూర్తిస్థాయిలో ప్రతి మారుమూల గ్రామానికి రోడ్లు నిర్మించడానికి రూ.2800 కోట్లు అవసరం ఉంటుందని చెప్పారు. ప్రధానమంత్రి జన్ మన్ కార్యక్రమం కింద రూ.454
మంజూరు అయ్యాయని చెప్పారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద రూ. 250 కోట్లతో బీటీ రోడ్లు, డబ్ల్యు బి ఎం రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరణకు చర్యలు చేపట్టామని దానికి అవసరమైన ప్రతిపాదన పంపించగా ముఖ్యమంత్రి ఆమోదించారని అన్నారు.
ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్య లింగం, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు జె సుభద్ర,ఎమ్మెల్సీ హరి ప్రసాద్ , పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ, ఐటీడీఏ ఇన్చార్జి ప్రాజెక్ట్ అధికారి జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం జె అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమని పటేల్, డీఎఫ్ఓ సందీప్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఈఎంసి, బాలు నాయక్ జిసిసి చైర్మన్ కేడారి ,శ్రావణ్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ దోన్ను దొర,మాజీ మంత్రి మణికుమారి, మాజీ శాసన సభ్యురాలు గడ్డి ఈశ్వరి, డుంబ్రిగూడ ఎంపీపీ ఈశ్వరి ఎంపీటీసీ గీత