భారీ వర్షానికి రింతాడా హైవే పక్కన నేలకొరిగిన విద్యుత్ స్తంభం

హైవే పక్కన స్తంభాలకు కాంక్రీట్ వేయకపోవడం వల్ల ప్రమాదం

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, జూలై 14:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం రింతాడా గ్రామంలో నేషనల్ హైవే 516 రహదారికి ఆనుకొని ఉన్న విద్యుత్ స్తంభం గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి ఆదివారం ఉదయం నేలకొరగటం జరిగింది. వెంటనే అప్రమత్తమైన ఉప సర్పంచ్ మడతల సోమేష్ కుమార్ విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే విద్యుత్ లైన్ ఆపివేయటంతో పెద్ద ప్రమాదం తప్పింది. నేషనల్ హైవే 516 రహదారి నిర్మాణంలో భాగంగా పాత విద్యుత్ స్తంభాలు తొలగించి కొత్త విద్యుత్ స్తంభాలు వేయడం జరిగింది.కానీ స్తంభాలకు కాంక్రీట్ వేయకపోవటం వలన ఈ ప్రమాదం సంభవించిందని స్థానిక గ్రామస్తులు తెలిపారు. విద్యుత్ శాఖ మరియు హైవే రోడ్డు నిర్మాణ అధికారులు వెంటనే స్పందించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉప సర్పంచ్ సోమేశ్ కుమార్, గ్రామస్తులు కోరుతున్నారు.

✒️

రింతాడ హైవే పక్కన నేలకొరిగిన విద్యుత్ స్తంభం

పెన్ పవర్,గూడెం కొత్త వీధి

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.