కోడాపుట్టులో పాఠశాల భవనం ఏర్పాటు చెయ్యాలని విద్యార్థులు, తల్లిదండ్రుల నిరసన 

పాఠశాల భవనం ఏర్పాటు చెయ్యాలి - కలెక్టర్ స్పందించాలని నినాదాలు

విద్య అభ్యాసనకు సామాజిక భవనమే దిక్కు 

4 సంవత్సరాలుగా పాఠశాల భవనములేక కమ్యూనిటీ హాల్ లోనే పాఠశాల నిర్వహణ

4 సంవత్సరాల క్రితం ఈదురుగాలులకు పాఠశాల పై కప్పు ఎగిరిపోయిన వైనం,
పట్టించుకోని అధికారులు

ప్రభుత్వం వెంటనే స్పందించాలి
 - విద్యార్థుల తల్లిదండ్రులు

ముంచంగిపుట్టు, పెన్ పవర్, జూలై 18.

ఆ గ్రామంలో43 మంది విద్యార్థులు ఉన్న పాఠశాల భవనం లేదు. సామాజిక భవనమే పాఠశాల నిర్వహణ ఆశ్రమముగా మారడంతో  ఆ గ్రామస్తులు, విద్యార్థులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాల భవనం ఏర్పాటు చెయ్యాలని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. పాఠశాల భవనంలేక నాలుగు సంవత్సరాలు సామాజిక భవనమే దిక్కు. చేసేది లేక ఉపాధ్యాయులు 1నుండి 5వ తరగతులు వరకు 43 మంది విద్యార్థులకు ఒకే హాల్ లో  కూర్చోబెట్టి పాఠశాల నిర్వహిస్తున్నారునీ, 4 సంవత్సరాల క్రితం భారీ ఈదురుగాలులకు పాఠశాల భవనం పై కప్పు ఎగిరిపొయ్యాయని, ఇప్పటికీ దానిని పట్టించుకునే అధికారులు, నాయకులే కరువయ్యారని విద్యార్దుల తల్లిదండ్రులు, గ్రామస్తుల నిరసన ఆక్రందన వివరాలలో...అల్లూరి సీతారామరాజు జిల్లా, ముంచంగిపుట్టు మండలం, అత్యంత మారుమూల లక్ష్మీపురం పంచాయితి, కోడాపుట్టు గ్రామంలో మండల పరిషత్ పాఠశాలలో  విద్యార్థుల చదువుకై పాఠశాల భవనంలేక సామాజిక భవనంలోనే పాఠశాల నిర్వహించే దుస్థితి నెలకొందని పిల్లల తల్లిదండ్రులు గురువారం విద్యార్థులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. నూతన పాఠశాల భవనం మంజూరు చేయాలని, జిల్లా కలెక్టర్ స్పందించాలని.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గ్రామస్థులతో కలసి పాత పాఠశాల దగ్గరకు వెళ్ళి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా విద్యార్ధుల తల్లిదండ్రులు బురిడీ మత్యరాజు, కొర్ర సొమ్ర, కొర్ర సిదేస్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ బి. చిరంజీవి పాత్రికేయులకు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో 73 కుటుంబాలుగా 387 మంది జనాభా కలిగి ఉన్నామని, గ్రామంలో గల మండల పరిషత్ పాఠశాలలో 43 మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు.

అయితే తమ పిల్లల చదువు కై పాఠశాల భవనం లేదని, గ్రామంలో నిర్మించిన సామాజిక భవనంలోనే ఉపాధ్యాయులు తరగతి గదులు నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం గాలి బీభత్సానికి గ్రామంలో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనం పైకప్పు ఎగిరిపోయిందని, అప్పటినుండి ఈ కమ్యూనిటీ హాల్ లోనే పాఠశాల నిర్వహణ కొన సాగుతుందన్నారు. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు 43 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ పాఠశాల భవనం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  నూతన పాఠశాల భవనం మంజూరు చేయడమే కాకుండా పాఠశాల పాత భవనానికి మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. పాఠశాల భవనం కై గతంలో పలుమార్లు విద్యాశాఖ అధికారులకు ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసిన సమస్య పరిష్కారం కాలేదన్నారు. పాఠశాల భవనం లేకపోవడంతో గ్రామంలో గల సామాజిక భవనము ఇతర కార్యక్రమాలకు ఉపయోగించడం లేదని, ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి పాఠశాల భవనం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై లక్ష్మీపురం పంచాయతీ  సర్పంచ్ కొర్ర త్రినాథ్ కు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు భూషణ్ కు వివరణ కోరగా గత ప్రభుత్వ హాయంలో నాడు నేడు కింద పెట్టినప్పటికీ పాఠశాల భవనం మంజూరు కాలేదని, పాత పాఠశాల భవనానికి మరమ్మత్తుల కొరకు ఎన్నికలకు ఆరు నెలల ముందర ఐదు లక్షల రూపాయలు నిధులు విద్యాశాఖ అధికారులు కేటాయించినప్పటికీ సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా అవి అమలు కాలేదు అన్నారు. ఈ ప్రభుత్వములో నైనా కోడాపుట్టు గ్రామంలో నూతన పాఠశాల భవనం మంజూరు చేయాలని పంచాయతీ సర్పంచ్ కొర్ర త్రినాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

About The Author: Admin