తుపాను ప్రభావిత గుమ్మిరేవుల,ధారకొండ పంచాయతీల్లో ఎంపీ తనుజారాణి,ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరాజు,రేగం మత్స్యలింగం,ఎమ్మెల్సీ కుంభా రవి బాబు, జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర శనివారం పర్యటించారు. మాదిమళ్లు, కమ్మరితోట గ్రామాల్లో గిరిజనులతో మాట్లాడారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ.. తుపాను కారణంగా నష్టపోయిన గిరిజన రైతులకు నష్టపరిహారం అందివ్వాలని, ఉపాధి హామీ పథకం ద్వారా పొలాలను బాగుచేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరారు.ఎంపీ తనుజారాణి మాట్లాడుతూ, కూలిపోయిన ఇళ్ల స్థానంలో కొత్తవి నిర్మించి ఇవ్వాలన్నారు.లవ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఇళ్లు కోల్పోయిన 35 కుటుంబాలకు తాత్కాలికంగా నివాసం ఉండటానికి టెంట్లు అందజేశారు.75 కుటుంబాలకు నిత్యావసర సరకులు వైకాపా ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. లవ్ మినిస్ట్రీస్ అధినేత ఏసుపాదం,వైకాపా ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కె. భాగ్యలక్ష్మి, ఎంపీపీలు కుమారి, అనుషాదేవి, జడ్పీటీసీ సభ్యులు శివరత్నం,పోతురాజు బాలయ్య,సర్పంచులు కమలమ్మ, నడిగట్ల రాజు తదితరులు పాల్గొన్నారు.