సాదాసీదాగా మండల సర్వసభ్య సమావేశం

రంగంపేట

స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రిమ్మలపూడి శ్రీదేవి   అధ్యక్షతన శుక్రవారం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సమావేశం సాదాసీదాగా  జరిగింది. ఈ వేసవి కాలంలో మండల పరిధిలో ఉన్న గ్రామాలలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ లు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ బి.శ్రీరామరాజు ,జడ్పిటిసి పేపకాయల రాంబాబు, వైసిపి నాయకుడు రిమ్మలపూడి వెంకటేశ్వర్లు,గ్రామ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, పలు శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About The Author: Admin