మండలంలో మల్లవరం గ్రామంలో కరెంట్ షాక్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాద బాధితులను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సతీమణి జగ్గంపేట కో-ఆపరేటివ్ రూరల్ బ్యాంక్ మాజీ చైర్మన్ జ్యోతుల మణి, జనసేన జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్, జగ్గంపేట నియోజకవర్గం బిజెపి ఇన్చార్జి దాట్ల కృష్ణ వర్మ పరామర్శించారు. గుర్రం వీర విష్ణు ఎంతో శ్రమించి పెట్టుకున్నటువంటి కొట్టు అగ్నికి ఆహుతయింది. కొట్టులో ఎంతో విలువైన సామాగ్రి, గ్యాస్ బండలు, గ్యాస్ స్టవ్, బీరువాలు, డబల్ కాట్ మంచం, పరుపు వంట సామాగ్రిలతో సహా కాలి బూడిదయింది. సుమారు మూడు లక్షలు ఆస్తి నష్టపోయిన గుర్రం వీర విష్ణుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగ్గంపేట కో-ఆపరేటివ్ రూరల్ బ్యాంక్ మాజీ చైర్మన్ సతీమణి సొసైటీ మాజీ చైర్మన్ జ్యోతుల మణి, జగ్గంపేట జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్. పరామర్శించి మనోధైర్యం కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జన సైనికులు వీర విష్ణు అగ్ని ప్రమాదంలో చాలా నష్టపోయారని వారికి రేపు రాబోయే సంకీర్ణ ప్రభుత్వంలో పక్కా ఇల్లు నిర్మించి అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు
అగ్రి ప్రమాద బాధితులను పరామర్శించిన జ్యోతుల, తుమ్మలపల్లి
గోకవరం