తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్న పోలీసు యంత్రాంగం, అధికారులు ఎన్నికలవేళ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ పి జగదీష్ సూచించారు జిల్లా పరిధిలోని గోపాలపురం మండలం జగన్నాధపురం గ్రామ శివారులో గురువారం రెండు కోట్ల 40 లక్షల రూపాయలు నగదును తనిఖీ బృందం పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ తనిఖీ బృందాలు, పోలీసులు ఎన్నికలు అయ్యేవరకు ఇదే ఉత్సాహంతో పని చేస్తూ విధులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే పోలీసుల కన్ను కప్పి ఇతర మార్గాల ద్వారా నగదు ఏవైనా వస్తువులను ఎవరైనా తరలిస్తూ ఉంటే ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించడంతో పాటు 112 నంబర్ కు ఫోన్ చేయాలన్నారు. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 21 ప్లేయింగ్ స్క్వాడ్ బృందాలు, 24 స్టాటిక్ సర్వే లెన్స్ బృందాలు, 15 ఇంటిగ్రేటెడ్ పోలీస్ చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికలు సజావుగా జరగడానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండడానికి అక్రమ రవాణా అరికట్టడానికి తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు పోలీసులు ముందు ముందు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తూ ఎన్నికలు విజయవంతంగా ప్రశాంతమైన వాతావరణంలో జరిగే విధంగా చూడాలని అన్నారు. నగదు పట్టుకున్న సిబ్బందిని ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు.
పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎస్పీ జగదీష్
గోపాలపురం,