చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యం

టి. నరసాపురం,

 

పోలవరం నియోజకవర్గం అభ్యర్ధి విషయంలో చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యం అని తెలుగుదేశం పార్టీ నాయకులు జయ్యవరపు శ్రీరామమూర్తి, నల్లూరి వెంకట చలపతి రావు తెలిపారు. టి నరసాపురంలో టిడిపి మండల అధ్యక్షుడు నాయుడు రామకృష్ణారావు గౌడ్ జన్మదినం వేడుకలు మండల తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వర్గీయ ఎన్ టి ఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం కేక్ కట్ చేసి రామ కృష్ణా రావు గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు     మాట్లాడుతూ  సార్వత్రిక ఎన్నికల్లో కార్యకర్తలందరూ పొత్తు ధర్మాన్ని పాటించి కూటమి అభ్యర్ధి విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయగల సత్తా గల నాయకుడు చంద్రబాబు అన్నారు. పోలవరం నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగరాలి అన్నారు. జన్మదిన వేడుకలకు తరలి వచ్చిన  ఏడు మండలాల నుండి తరలివచ్చిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొడియం సూర్యచంద్రరావు, గంగిరెడ్ల  మేఘాలా దేవి,ఆచంట సూర్యనారాయణ, బొంతు సత్యనారాయణ,రాజా బాబు, అక్కిశెట్టి బలరామ్,నాళం కాశీ, అనుమోలు సంధ్యా రాణి శ్రీనివాస రావు, అద్దంకి జగ్గారావు, గ్రామ కమిటీ అధ్యక్షులు  కొల్లి రమేష్, పెద్దిన శేఖర్, పి. పవన్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.

About The Author: Admin