వసుల్‌ రాజాలు

ఏపిసోడ్‌`1

 ‘‘ అష్టదిగ్బందుల’’ చేతుల్లో మగ్గిపోతున్న జంగారెడ్డిగూడెం సబ్‌ రిజిష్ట్రార్‌ ఆఫీస్‌


  పాత రికార్డులు భద్రపరిచే గదిలోకి ప్రయివేటు వ్యక్తులు 


  అత్యంత భద్రంగా ఉండాల్సిన ప్రజా ఆస్తూల వివరాలు ప్రయివేట్‌ వ్యక్తుల చేతుల్లో...


  పభుత్వ అధికారులకు ఇచ్చే పాస్‌వర్డ్‌ సైతం... క్రాక్‌ చేసిన  ‘‘ అష్టదిగ్బందులు’’

బ్యూరోరిపోర్ట్‌ పెన్‌పవర్‌ జంగారెడ్డిగూడెం ఏప్రిల్‌ 07:

జంగారెడ్డిగూడెం సబ్‌ రిజిస్ట్రారు ఆఫీసులో ప్రైవేటు వ్యక్తుల దోపిడీ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఈ ఆఫీసులో గతంలో పనిచేసి రిటైర్డ్‌ అయిన ఉద్యోగి, మరో ఏడుగురుతో కలిసి ఒక గ్రూపు ఏర్పాటు చేసుకుంది...ఇదే శాఖలో పనిచెస్తూన్న జిల్లా అధికారికి బంధువు కావడం తో అమెకు అడ్దు అదుపు లెకుండా పొతుంది దీంతో ఎనిమిది మంది మూకుమ్మడిగా ఏ నిర్ణయం తీసుకుంటే అదే అక్కడ అమలౌతుంది... కాదు కూడదని ఏవరైనా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడానికి వెళితే... ఇక వారి సంగతి అంతే...? ఏన్నో కొర్రిలు పడి చివరకు ‘‘ అష్టపదులకు ’’ వారు అడిగినంత ఇచ్చి పని కానిచ్చుకోవాల్సిందే..

ఇక అసలు విషయానికి వస్తే... ఇక్కడకు ఏ అధికారి వచ్చిన ముందుగా ఆ అధికారి బలం, బలహీనతలు తెలుసుకుంటారు... అందుకు తగ్గట్టు ఆ అధికారిని వారి ఆధ్వర్యంలోకి తెచ్చుకుంటారు... ఇంకేముంది రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవేముంది... అన్న చంధంగా తమ ఇష్టారీతిన ‘‘అష్టపధులు’’ తమ ఆస్తులను పెంచుకుంటూ పోతున్నారు.  ఒక రిటైర్డ్‌ ఎంప్లయితో కూడి సుమారు ఎనిమిది మందికి రోజుకి 4,000/- రూపాయల జీతం ఎక్కడి నుండి వస్తుంది అనేది ఒక ప్రశ్న గా మారింది. అయితే రాజ్యం మొత్తం ఈ ప్రైవేటు వ్యక్తుల చేతిలోనే ఉంది. ఎంతో భద్రం గా ఉండవలసిన ప్రజా ఆస్తులు విషయాలు వీరు చేతిలోనే ఉంటాయి.  ఎన్నో సంవత్సరాలు గల పాత రికార్డులు భద్రపరిచే రికార్డు రూములోనికి ప్రభుత్వ అధికారులకు తప్ప ఎవరికి అనుమతి లేదు, కాని ఆ రికార్డు రూముల్లో వీరు రోజూ కనిపిస్తూనే ఉంటారు, ఆ రికార్డు ను వారి వ్యక్తిగత ఫోన్‌ లలో ఫోటోలు తీసి వాటిని బయటకు అధిక సొమ్ములకు అమ్ముకుంటూ ధనర్జనే ద్యేయంగా సాగిపోతున్నారు.. మిగతా బాగం  రేపటి పెన్ పవర్ దిన పత్రికలో 

ఏపిసోడ్‌`2 లో ... 


అష్టపదుల పేర్లు వారి ఆస్తుల చిట్టాలు, లేఖర్ల భాగోతం, సబ్‌ రిజిస్ట్రార్‌ రెండిళ్ల వ్యవహారం..?  పెన్‌పవర్‌ పాఠకులకోసం

About The Author: Admin