అనపర్తి నియోజకవర్గoలో ఎన్నికల నిబంధనలు ఉల్లoఘిoచి ప్రార్థనా మందిరాలలో ఎన్నికల ప్రచారం చేస్తున్న అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి భార్య ఆదిలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని అనపర్తి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వారికి ఫిర్యాదు చేశానని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం అనపర్తి తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆయన విలేకరులతో మాట్లాడుతూ అనపర్తి నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుత ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి భార్య ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచార కార్యక్రమాలో పాల్గొంటున్నారు. వివిధ గ్రామాలలో క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లో (చర్చిలు) సమావేశాలు ఏర్పాటు చేసి, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి సూర్య నారాయణరెడ్డిని గెలిపించమని ప్రచారం చేయుచున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ప్రార్థనా మందిరాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదు.
అనపర్తి మండలం అనపర్తి, పెదపూడి మండలం కైకవోలు చర్చిలలో ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యమని ప్రచారం నిర్వహించారు. ఆయా చర్చిలలో జరిగిన ప్రచార కార్యక్రమం వీడియోలను సిడి రూపంలో అందిoచడం జరిగిందన్నారు. ఎన్నికల నిబంధనలు బేఖతారు చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆదిలక్ష్మిపై తగు చర్యలు తీసుకోవలసినదిగా ఎన్నికల కమిషనర్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో అనపర్తి టౌన్ నాయకులు పాల్గోన్నారు.