మళ్లీ జగనన్నను గెలిపించుకుందాం

మళ్లీ జగనన్నను గెలిపించుకుందాం

కరప

రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందించిన నాయకుడు జగనన్నకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని జెడ్పీటీసీ యాళ్ల సుబ్బారావు, ఎంపీపీ
పెంకే శ్రీలక్ష్మీ సత్తిబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ గ్రామకమిటీ ఆధ్వర్యంలో కరపలో
మూడోరోజు ఆదివారం మెరకవీధి, పల్లపువీధి, గాజుల వారి వీధి శివాలయం, విష్ణ్వాలయం వీధులలో స్థానికనాయకులతో కల్సి
ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ పథకాలు అమలు చేసిన నాయకుడు జగనన్నతోనే సాధ్యమని అన్నారు. రాష్ట్రంలో అలాంటి పధకాలు అమలు చేయాలంటే తిరిగి మనం జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలని అన్నారు. సీఎం జగన్ సారథ్యంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు గ్రామంలో సంక్షేమం, అభివృద్ధి రూపేణా రూ 102.42 కోట్ల లబ్దిచేకూర్చడం జరిగిందన్నారు. గ్రామంలో చేసిన అభివృద్ధిపనులు, అమలుచేసిన సంక్షేమ పధకాలను వివరిస్తూ ఎన్నికల ప్రచారం
నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమం మరింతగా జరగాలంటే వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి కాకినాడ రూరల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబును, ఎంపీ అభ్యర్థి
చలమలశెట్టి సునీల్ ను గెలిపించి, జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని ఓటర్లను జెడ్పీటీసీ, ఎంపీపీ
అభ్యర్ధించారు. గ్రామసర్పంచ్ సాదే ఆశాజ్యోతి, వైస్ఎంపీపీ పాట్నీడి భీమేశ్వరరావు, గ్రామకమిటీ అధ్యక్షుడు మేడిశెట్టి సత్తిబాబు, వైఎస్సార్ సీపీ నాయకులు పెంకే సత్తిబాబు, చిన్నారి మురళి, పుణ్యమంతులు
బాల, శ్రీపాదం లోవరాజు, గండి లోవరాజు, శ్రీపాదం గోవిందు, పలివెల శ్రీధర్, గోన శ్రీనివాస్, రెడ్డి
వీరభద్రరావు, విశ్రాంత లైబేరియన్ గోన చిన్నయ్య, సాదే లోహిదాస్, ఉప సర్పంచ్ భోగిరెడ్డి
సూర్యనారాయణ, చొల్లంగి దుర్గారావు, నాగల బాలాజీ, మద్దూరి భాస్కర్, ముద్రగడ నానాజీ, వీరబాబు,ఎం సత్యనారాయణ, రాయుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author