స్టాఫ్ రిపోర్టర్ పెన్ పవర్ కాకినాడ, ఆగస్టు 22:
ఏపీలో పవన్ సొంత నియోజకవర్గం ఏది అంటే.. ఆయనకు కూడా అది బిగ్ క్వశ్చన్‌గానే ఉండేది. తాను అందరివాడిగా ఉండాలని అనుకుంటానని చెప్పేవారు పవన్. తనకంటూ ఒక సొంత నియోజకవర్గం ఉండాలన్న ఆలోచన కూడా లేదని చెప్పుకొచ్చేవారు. అయితే ఇప్పుడు పవన్ కేరాఫ్ పిఠాపురం అయిపోయింది. ఆయనకంటూ ఒక సొంత నియోజకవర్గం ఏర్పడిరది. పవన్ కూడా తన మంత్రిత్వ శాఖలలో ఏ కొత్త నిర్ణయం తీసుకున్నా పిఠాపురం నుంచే ప్రారంభించాలని ఆదేశిస్తున్నారు. అక్కడ ఇల్లు కూడా తీసుకున్నారు.పవన్ సోదరుడు నాగబాబు పిఠాపురం నియోజకవర్గ బాధ్యతలను చూస్తున్నారు. పవన్ అందుబాటులో ఉన్నా లేకున్నా నాగబాబు మాత్రం జన సైనికులకు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. జనసేనకు దక్కిన ఏకైక ఎమ్మెల్సీ సీటుని గెలిచిన హరిప్రసాద్ కూడా పిఠాపురాన్ని దత్తత తీసుకుంటానని చెప్పారు. ఇక జనసేన నాయకులు పలువురు పిఠాపురంలోని గ్రామాలను దత్తత తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ పిఠాపురంలో అపోలో హాస్పిటల్‌ను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం అవసరమైన భూమి కోసం సెర్చ్ చేస్తున్నట్లు టాక్. రామ్‌చరణ్ సతీమణి ఉపాసన అపోలో యాజమాన్యంలో భాగం కావడంతో.. త్వరలోనే పిఠాపురంలో తమ ప్రాజెక్టును స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది.మెగా కుటుంబంలో చాలా మంది హీరోలు ఉన్నారు. వారంతా కూడా తమకు తోచినట్లుగా పిఠాపురంలోని గ్రామాలను దత్తత తీసుకుని డెవలప్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే పవన్ పుణ్యమా అని పిఠాపురంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. పవన్ విూద అభిమానంతో చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి భూములు కొని తమ ప్రాజెక్టులు పెట్టాలని అనుకుంటున్నారు. వీటితో పాటు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి తన మూవీ విశ్వంభర ప్రీ రిలీజ్ ఫంక్షన్ పిఠాపురంలో నిర్వహిస్తారని అంటున్నారు.ఎన్నికల్లో చెప్పినట్లుగానే పిఠాపురం నియోజకవర్గాన్ని.. ఏపీలోనే వేరే లెవల్‌కు తీసుకెళ్తున్నారు పవన్. రాజకీయ జీవితంలో కొనసాగినంత కాలం పవన్ పిఠాపురం నుంచే పోటీ చేస్తారన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వ నిధులతో పిఠాపురం రూపురేఖలు మార్చేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నట్లు జనసైనికులు చెప్తున్నారు.