దళితులపై మరో దాడికి తోట త్రిమూర్తులు సిద్ధం!

 న్యూస్ డెస్క్ పెన్ పవర్

దళితులు కావాలో, దళితులపై దాడులు చేసే నేరస్తుడైన త్రిమూర్తులు కావాలో వై.యస్. జగన్  తేల్చుకోవాలని సవాల్ విసిరిన దళిత సంఘాల నేతలు

దళితుల పై రెచ్చగొట్టే విధంగా తోట  వ్యాఖ్యలు
 
భయభ్రాంతులతో శిరోముండనం  కేసు దళిత బాధితులు

వెంకటాయపాలెం శిరోముండనం కేసులో నేరం రుజువైన నేరస్థుడు తోట త్రిమూర్తులు  కోర్టు తీర్పు వెలువడిన మరునాడే  రెచ్చగొట్టే  వ్యాఖ్యలకు  పాల్పడ్డారు. బుధవారం ఆయన దళితుల నుద్దేశించి తీవ్ర  వ్యాఖ్యలు చేశారని,  బెదిరింపులకు కూడా  పాల్పడ్డారని,  దీంతో బాధితులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని, దళిత సంఘాల నేతలు మండి పడుతున్నారు. త్రిమూర్తులు మాట్లాడుతూ... ఈ తీర్పు చూసి తప్పుడు నా కొ...,(నా కొడుకులు అనే  అర్ధంలో.. ),తప్పుడు నాయాళ్ళు అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారట.. ఏ కటకటాలు నన్ను ఆపలేవు.. ఎవరు నన్ను ఆపలేరు. తీర్పు వెలువడిన   రెండగంటలలోనే  బెయిల్ మీద  రావడం జరిగింది.... నన్ను ఎవరూ ఏమీ చేయలేరు..., ఈ నియోజకవర్గంలో గానీ .. రామచంద్రపురం నియోజకవర్గంలో గానీ ... అంటూ తీవ్ర  వాఖ్యలు చేశారు. దీంతో బాధితులలోనూ , దళితుల్లోనూ  అభద్రతా భావం నెలకొంది. ఆయన రెచ్చగొట్టే వాఖ్యలు దళితులపై దాడులకు ఉసిగొలపే విధంగా ఉన్నాయని నాయకులు పేర్కొన్నారు, రక్షణ కరువై  అయోమయస్థితికి  నెట్టబడ్డారని.   కోర్టులు, పోలీసులు, ఎన్నికల కమిషన్  తగిన చర్యలు చేపట్టకపోతే నష్టం అపారంగానే ఉండొచ్చని, ఇచ్చిన బెయిల్ పైన్యాయస్థానానికి  అప్పీలు వెళ్ళటానికి తప్ప  చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడడానికి కాదని. ఆయన ఒకరకంగా కోర్టుధిక్కారానికి పాల్పడినట్టే  లెక్క అని కుల సంఘాల నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేసారు. దళితులకురక్షణ కోసం, శాంతి భద్రతల సమస్య రాకుండా   ఆ ప్రాంతం నుండి  పోలీసులు ఆయన్ని  బహిష్కరించాలని, ఎస్సీ, ఎస్టీ  అత్యాచార నిరోధక చట్టం కూడా అదే చెబుతుంది. బెయిల్ రద్దు తప్ప మరో మార్గం లేదని, ఇప్పటికే   దోషి అని   కోర్టు నిర్ధారణ కూడా చేసింది కాబట్టి ఆయనకు కేటాయించిన మండపేట అసెంబ్లీ  వైసీపీ టికెట్టును  వెనక్కి తీసుకోవాలని, వైయస్ జగన్  ను దళితులు, దళిత ,ప్రజా సంఘాలు కోరుతున్నారు.  ఎమ్మెల్సీ పదవి నుండి రాజీనామా చేయించాలని,  పార్టీ నుండి తొలగించాలని వారు కోరుతున్నారు. దళితులు కావాలో, దళితులపై దాడులు చేసే నేరస్తుడైన త్రిమూర్తులు కావాలో వై.యస్. జగన్  తేల్చుకోవాలని సవాల్ చేస్తున్నారు.  గతంలో వైసీపీ  అధికారంలోకి వచ్చిందంటే ప్రధానంగా ఎస్సీ,ఎస్టీ ఓట్లేనని గుర్తేరగాలని హితవు పలుకుతున్నారు

About The Author: Admin