రివర్స్ టెండర్ జగన్ కి రివర్స్ గిఫ్ట్ ఇవ్వనున్న ఉపాధ్యాయ ఉద్యోగులు.

రివర్స్ టెండర్ జగన్ కి రివర్స్ గిఫ్ట్ ఇవ్వనున్న ఉపాధ్యాయ ఉద్యోగులు.

కావలి

రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానీ సాగనంపండి
వైసీపీ  ప్రభుత్వంపై ధ్వజమెత్తిన: వంటేరు

కావలి పట్టణములో శనివారం మాజీ శాసనసభ్యులు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ కు ఒక విజ్ఞప్తి చేశారు.వంటేరు మాట్లాడుతూ, రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన ఎలా ఉంది అనేదానికి ప్రభుత్వ ఉద్యోగులను పెట్టిన ఇబ్బందులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఆయన పత్రికా ముఖంగా ఉపాధ్యాయ ,ఉద్యోగ వ్యాపారస్తులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. అయితే వైసిపి ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు నెలనెలా జీతమే సక్రమంగా ఇవ్వకుండా వారు కుమారుల, కుమార్తెల పెళ్లిళ్లకు దాచిపెట్టుకున్న నగదుకూడా వారి కుమార్తెల, కుమారుల పెండ్లికు అప్లై చేసుకుంటే ఇవ్వకుండా, ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు ఈ ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాల్లో చూసాం. ప్రభుత్వ ఉద్యోగులకు నెల నెల జీతం కూడా సక్రమంగా ఇవ్వకుండా చదువు చెప్పి  విద్యావంతులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులను  మద్యం షాపుల దగ్గర క్యూని నిలబెట్టడం కోసం ఏర్పాటు చేయడం ఎంత ఘోరమో.. ప్రభుత్వసిబ్బంది ఒక్కసారి ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులు ఆలోచించాలని కోరారు. అంతేకాకుండా ఆదివారంనుండి ఉద్యోగ, ఉపాధ్యాయులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుందని, మేధావులు,  ఉపాధ్యాయ, ఉద్యోగులు ఆలోచించి ఈ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి తగిన రీతిలో గుణపాఠం చెప్పాలని వారు కోరారు. అంతేకాకుండా ఐదు సంవత్సరాల్లో 27% ఫిట్ మెంట్ ఉన్న ఉద్యోగులకు దాన్ని రివర్స్ చేసి 23% కు తీసుకువచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి వారు తెలిపారు. ఏది ఏమైనాప్పటికీ మేధావులైన ఉపాధ్యాయులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు అంగన్వాడి టీచర్స్ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆయన పాత్రికేయులకు తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాన్ని అందించే విధంగా తన మేనిఫెస్టోలోఉండని, కాబట్టి కావలి నియోజక వర్గ ఎన్ డి ఏ ఉమ్మడి అభ్యర్థి విద్యావేత్త, పారిశ్రామికవేత్త కావ్య కృష్ణారెడ్డిని అంతేకాకుండా నెల్లూరు ఎంపీగా మేధావి, విద్యావంతులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అలాగే రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని, బాబు వస్తే జాబులు వస్తాయని ఒక నమ్మకంతో యువత ఎదురుచూస్తుందని, ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో ప్రజలు వైసిపి ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని, మార్పును కోరుకుంటున్నారని, తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతో వారిని గెలిపించాలని ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ కుట్టబోయిన రాజారావు బిజెపి పట్టణ అధ్యక్షులు పుట్టుపోయిన బ్రహ్మానందం, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author