కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే  కాకర్ల సురేష్

mla-cakarla-suresh-who-launched-the-community-sanitary-complex

స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్చ దివస్ కార్యక్రమంలో భాగంగా కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే  కాకర్ల సురేష్

జలదంకి పెన్ పవర్ ఫిబ్రవరి 15 :

  స్వచ్చాంధ్ర స్వచ్చ దివస్ కార్యక్రమంలో భాగంగా, బ్రాహ్మణ క్రాక గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్  భవనాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా ప్రారంభించారు.  శనివారం జలదంకి మండలం బ్రాహ్మణ కాక గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా చేపట్టిన స్వేచ్ఛ భారత్ స్వేచ్ఛ ఆంధ్రాలో భాగంగా పంచాయతీలలో నెలకొల్పిన చెత్త నుండి సంపద కేంద్రాలను వినియోగంలోనికి తీసుకురావడం జరిగిందన్నారు. జలదంకి మండలంలో నాలుగు చోట్ల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నారు. గ్రామంలోని తడి పొడి చెత్త లను సంపద కేంద్రాలకు తరలించి ఈ వ్యర్ధాల ద్వారా ఎరువును తయారు చేసే, సంపద సృష్టించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి గ్రామంలోని మహిళలు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న డస్ట్ బిన్నులను వాడి పంచాయతీ సిబ్బందికి సహకరించాలని తెలిపారు. ప్రతి నెల మూడో శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో ప్రతిష్ణాత్మకంగా నిర్వహించాలన్నారు. మండలంలోని 17 పంచాయతీలలోని చెత్త నుండి సంపద కేంద్రాలను ఉపయోగం లోనికి తీసుకురావడం జరుగుతుందన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్య వంతమైన జీవితం గడపాలని తెలియజేశారు. గ్రౌండ్ వాటర్ ను పెంపొందించుకునేందుకు మండలంలో మూడు గ్రామాలలో 100 ఇంకుడు గుంటలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు ఇంకుడు గుంటలను ఏర్పాటు చేసుకొని నీటిని సంరక్షించుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోసుపాతల వెంకటరమణయ్య దగు మాటి మాల్యాద్రి రెడ్డి తిరుపతి రెడ్డి చల్ల హనుమాన్ రెడ్డి కొండప నాయుడు దశ రామయ్య లింగం గుంట వెంకటేశ్వర్లు కంచర్ల వెంగపనాయుడు మండల యువత అధ్యక్షులు తిరుమలరెడ్డి రామారావు సర్పంచ్ ఇళ్ల సుధాకర్ ఎంపీడీవో బ్రహ్మయ్య పంచాయతీ కార్యదర్శి వనజ తహసిల్దార్ .పంచాయతీ శాఖ అధికారులు సిబ్బంది మండల నాయకులు తదితరులు ఉన్నారు.

About The Author: Admin