రేషన్ అయిపోయాయి డబ్బులు కావాలంటే ఇస్తా లేకపోతే లేదు
కావలి పట్టణంలోని వెంగళరావు నగర్ నవ వికాస్ సెంటర్లో చోటుచేసుకున్న వైనం
కావలి పెన్ పవర్ ఫిబ్రవరి 17
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ప్రతినెల రేషన్ బండ్లు ద్వారా ఇంటింటికి తిరిగి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు రేషన్ అందజేస్తుంది. పట్టణంలోని వెంగళరావు నగర్లో ప్రభుత్వం అందజేసే రేషన్ బియ్యం పై ఆధారపడి చాలామంది నిరుపేదలు జీవిస్తున్నారు ప్రతి నెల ఇచ్చే రేషన్ బియ్యం తింటూ జీవనాన్ని గడుపుతున్నారు.
రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు అందచేయకుండా అమ్మేసుకున్న వైనం. లబో దిబో మంటున్న లబ్ధిదారులు. కావలి పట్టణంలోని వెంగళరావు నగర్ నవ వికాస్ సెంటర్లో పేద ప్రజలకు ప్రభుత్వం అందజేసే రేషన్ బియ్యం ఆ నిర్వాహకుడు ఇవ్వకుండా ఉత్త బండి వేసుకొని వచ్చి రేషన్ ద్వారా ఇచ్చే బియ్యం, కందిపప్పు, చక్కెర, అయిపోయాయి ఇవ్వడం కుదరదు మీకు కావాలంటే డబ్బులు తీసుకోండి లేకపోతే పొండి అంటూ పేద ప్రజలపై ప్రతాపం చూపించాడు. కొంతమంది దగ్గర తంబులు వేయించుకొని వారికి బియ్యం ఇవ్వకుండా జారుకున్నాడు. పేద ప్రజలకు అందవలసిన రేషన్ సక్రమంగా అందజేయకుండా ప్రతినెల ఆ నిర్వహకుడు బయట వ్యక్తులకు అమ్ముకుంటున్నట్లు లబ్ధిదారులు పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి పేద ప్రజలకు అందవలసిన రేషన్ బియ్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని అంతేకాకుండా పేద ప్రజలకు అందవలసిన రేషన్ బియ్యాన్ని పక్క దారి పట్టిస్తున్న రేషన్ బండి నిర్వాహకుడి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.