కావలి పెన్ పవర్ ఫిబ్రవరి15
‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని అధికారులు శనివారం కావలిలో అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు..అధికారులు, ప్రజా ప్రతినిధులు,పారిశుధ్య కార్మికులు,విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ జరిపారు.ఈ సందర్భంగా కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశను దేశంలోనే అత్యంత పరిశు భ్రత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఇకపై ప్రతి నెలా మూడవ శనివా రాన్ని స్వచ్ఛ దివస్‌గా జరుపుకోవాలన్నారు.