ఉదయగిరి పెన్ పవర్ ఫిబ్రవరి 17
ఉదయగిరి టు బైరవకోన వయా సిద్దేశ్వరం బస్సు సర్వీసును ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సోమవారం ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం, సిద్దేశ్వరం మరియు భైరవకోనను పర్యాటక కేంద్రంగా, అభివృద్ధి చేసుకునే క్రమంలో, బస్సు సర్వీసును ప్రారంభించారు. ముందుగా పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, బస్సు ద్వారం దగ్గర రిబ్బన్ కటింగ్ చేసి, జెండా ఊపి, బస్సు ను స్టార్ట్ చేసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి సహకారంతో, భక్తుల కోరిక మేరకు, అవసరం దృష్ట్యా బస్సు సర్వీసును, ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సర్వీసు వారంలో ఒక్కరోజు అనగా సోమవారం ఉదయం 7:30 గంటలకు ఉదయగిరిలో బయలుదేరి సిద్దేశ్వరం వెళ్లి అక్కడ నుండి నేరుగా భైరవకోనకు చేరుకుంటుంది. అక్కడ గంట వ్యవధి తర్వాత తిరిగి ఉదయగిరి కి చేరుకుంటుంది. కనుక ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. గత ఎనిమిది నెలల కాలంలో ఉదయగిరి డిపో మేనేజర్ శ్రీనివాసరావు సహకారంతో అనేక ప్రాంతాలకు బస్సు సర్వీసులను పున్వర్ధించినట్లు తెలిపారు.
ఉదయగిరి కూటమి నాయకుల, సారథ్యంలో మెట్ట ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సిహెచ్ బయన్న, బిజెపి ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జి కదిరి రంగారావు, సీనియర్ నాయకులు ముడమాల రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు పులిచెర్ల నారాయణరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.