కందుకూరు తెలుగుదేశం పార్టీలోకి అధికారపార్టీ నుంచి వలసల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. వెళ్లొద్దని వైసిపి పెద్దలు ఎంత బతిమలాడుతున్నా, ఆ పార్టీ శ్రేణులు మాత్రం గట్టుదాటుకొని తెలుగుదేశం పార్టీ చెంతకు చేరుతున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న వలసలతో ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో టిడిపి మరింత బలంగా మారింది.
కందుకూరు పట్టణంలో..
గుర్రంవారిపాలెంకు చెందిన వైసీపీ సీనియర్ నాయకులు దామా వెంకటేశ్వర్లు, ఉప్పుటూరి సుబ్బారావు, ఉప్పుటూరి సుబ్బారావు (మిల్క్), ఉప్పుటూరి శ్రీనివాసరావు, రమేష్, అంజయ్య, రవి, ఉప్పుటూరి శేషయ్య కుమారులు, శ్రీనివాసరావు, చెంచయ్య, ఇంకా పలు కుటుంబాల వారు వైసీపీకి రాజీనామా చేసి టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో టిడిపిలో చేరారు.
పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పట్టణ మాజీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు, ప్రకాశం జిల్లా డైరీ మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, వార్డు అధ్యక్షుడు గుర్రం మాల్యాద్రి, స్థానిక నాయకులు గుర్రం మల్లికార్జున, అత్తోట మధుబాబు, గొల్లపూడి శ్రీనివాసరావు, గుండవరపు నరసింహారావు, గుర్రం మణి, ముప్పవరపు వేణు, బద్దిపూడి వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
వలేటివారిపాలెంలో... వలేటివారిపాలెంకు చెందిన సందాడి సంజీవ్ కుమార్, రూపినేని మాల్యాద్రి, మాధవరావు, వలేటి క్రాంతి కుమార్, కంచర్ల యుగంధర్, కల్లూరి కొండపనాయుడు రామ్మోహన్, వలేటి అంజయ్య, బండి మాధవరావు, గాలంకి మాలకొండయ్య, మాధవ, నల్లగట్ల ఆంజనేయులు, షేక్ అబ్దుల్ ఖాదర్, రహమత్ బాషా, ఇమ్రాన్ బాష, మస్తాన్, దస్తగిరి, ముమ్మడిసింగ్ రమణయ్య, పాలపర్తి బాబురావు, గంగారావు, రామకృష్ణ కుటుంబాల వారు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, గ్రామ పార్టీ అధ్యక్షులు కాకుమాని ఆంజనేయులు, కాకుమని హర్ష, వలేటి నరసింహం, గుత్తా మహేశ్వరరావు, కొండయ్య, మాల్యాద్రి, వలేటి నరసింహం, బూదాల మాధవరావు, తిరుపతయ్య, షేక్ ఖాజావలి, ఇర్ల ప్రసాద్, మాల్యాద్రి, చల్లా హనుమంతరావు, సుబ్బారావు, అంజి, సాల్మన్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
చాకిచర్ల నుంచి...
ఉలవపాడు మండలం చాకిచెర్ల పంచాయతీ శ్రీశ్రీ నగర్ కు చెందిన వైసిపి నాయకులు ఒంగోలు శ్రీహరి, వార్డు మాజీ సభ్యుడు తాటితోటి సుధాకర్ లు ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. యూనిట్ ఇంచార్జ్ తాటితోటి రవి ఆధ్వర్యంలో వీరు పార్టీలో చేరారు.
టిడిపి నీడకు పరిగెడుతున్న వైసీపీ శ్రేణులు
కందుకూరు