నెలరోజుల్లోనే హామీలు అమలు : సీఎం చంద్రబాబు

Promises will be implemented within a month: CM Chandrababu

పెంచిన మొత్తంతో కలిపి పింఛన్లు పంపిణీ చేసిన ప్రత్తిపాటి

చిలకలూరిపేట పెన్ పవర్ ప్రతినిధి జులై 01:ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోపే అమలు చేసి చూపిస్తున్న మనసున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అని కొనియాడారు మాజీమంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. సంక్షేమశకానికి నాంది పలికిన రోజుగా జులై-1 రాష్ట్ర చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుందని అన్నారు. పేదరికం నిర్మూలన, ప్రతిఒక్కరు ఆత్మగౌరవంతో జీవించే దిశగా ఈరోజు రాష్ట్రం కొత్త ప్రయాణం మొదలైందని తెలిపారు. సోమవారం చిలకలూరిపేట 7, 9 వార్డుల్లో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. లబ్ధిదారులందరికీ పెంచిన రూ. 1000, గడిచిన 3నెలల మొత్తం కలిపి ఒకేసారి రూ.7 వేలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతో ప్రజలకు పండగ, స్వాతంత్ర్యం వచ్చినట్లు, కష్టాల నుంచి బయటపడ్డట్లు భావిస్తున్నారన్నారు. అవ్వాతా తల కళ్లల్లో ఆనందం నింపడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని, ఆ దిశగానే ఇచ్చి న హామీలు అమలుకు 5ఏళ్లు తీసుకోకుండా నెలలోనే నిజం చేసి చూపించామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు చిరునవ్వులు చిందించడానికి చర్యలు చేపట్టామన్నారు ప్రత్తిపాటి. సుమారు రూ.4,200 కోట్లతో పేదలకు పింఛన్ల అందిస్తున్న శుభతరుణాన ఎవరి ముఖం చూసినా ఆనందం, నవ్వులే కనిపిస్తుండడం సంతోషంగా ఉందన్నారు. 2 లక్షలమంది సిబ్బంది ఉంటే పింఛన్లు పంపిణీ చేయడానికి వాలంటీర్లు అంటూ కుంటిసాకు చెప్పి ఎన్నికలకు ముందు  వైసీపీ ప్రభుత్వం 34 మంది ప్రాణాలు బలిగొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై రాష్ట్రంలో వారి పేరు చెప్పకుండా ఉంటేనే మంచిదన్నారు. త్వరలో వైకాపా కనుమరుగైనా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు. వారి అయిదేళ్ళ అరాచక పాలనలో ఎవరూ గౌరవంతో బతికే పరిస్థి తి లేకుండా చేయడంతోనే విముక్తి కోసం ప్రజలంతా ఓటుతో బుద్ధి చెప్పారన్నారు ప్రత్తిపాటి. రాష్ట్రవ్యాప్తంగా  65.18 లక్షలమందికి పండగ వాతావరణంలో పంపిణీ చేస్తున్న పింఛన్లు రూ.4 వేలులో రూ.2900 తెలుగుదేశం, చంద్రబాబు చేతుల మీదుగానే పెంచడం చరిత్రగా అభివర్ణించారాయన. అదీ తెలుగుదేశం పార్టీ గొప్పతనం, పేదవాడిని ఆదుకునే మంచి మనసున్న నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. ఇది ప్రజా ప్రభుత్వమని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని, సంపదను పెంచాలని.. దాన్ని పేదలకు అందే విధంగా చేయడమే ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందాలన్న, అమరావతి, పోలవరం పూర్తి కావాలన్న, పేదల కళ్లల్లో ఆనందం చూడాలన్న తెలుగుదేశంతోనే సాధ్యమని ప్రజలంతా భావిస్తున్నట్లు తెలిపారు ప్రత్తిపాటి. చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లతో ముందుకు పోవడం, పేదవాడి కళ్లల్లో ఆనందం చూడటమే ఈ ప్రభుత్వం లక్ష్యమన్నారు.

About The Author: Admin