జూలై 18 నుండి 28వ తేదీ వరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు
జనసైనుకులు పిలుపు
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గ జనసేన పార్టీ ఐటీ కోఆర్డినేటర్ ఎల్ రంజిత్ కుమార్ శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ కేంద్ర ఆదేశాల మేరకు 4వ విడత క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈనెల 18 నుండి 28వ తేదీ వరకు ఒక పండగ లా జరుగుతుందని అన్నారు. క్రియాశీలక సభ్యత్వం కావాలనుకునే వారు, క్రియాశీల సభ్యత్వం రెన్యువల్ కొరకు రూ.500 చెల్లించాలని అన్నారు. జనసేన నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు, వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకొని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుతున్నామన్నారు. నేడు మనం కట్టే 500 రూపాయలు రేపు మన కుటుంబానికి 5 లక్షల రూపాయల భద్రతను & , భరోసాను కల్పిస్తుందని ఇది దేశంలో ఏ పార్టీ చేయని విధంగా ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేని విధంగా తమ కార్యకర్తలకు, వారి కుటుంబాలకు భరోసానిస్తూ ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. క్రియాశీలక సభ్యుడు పార్టీ ఏ సమావేశానికి గాని, రోడ్డుపై నిరసన కార్యక్రమానికి గాని పిలుపునిచ్చినాతప్పనిసరిగా హాజరుకావాలని, అటువంటి సభ్యులకు ప్రమాదవశాత్తు ఏదైనా జరగరానిది జరిగితే వారికి భరోసాను కల్పిస్తూ ఆసరాగా ఉండేందుకు ఏదైనా పార్టీ ఉందంటే అది జనసేన పార్టీయేనని అన్నారు. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పపార్టీ తరపున పోటీ చేసేందుకు అర్హతగా తప్పనిసరి క్రియాశీలక సభ్యులుగా ఉండాలని, ఆ క్రియాశీలక సభ్యుడు ప్రజల్లోకి వెళ్లి పార్టీ విధి విధానాలని చెప్పగలుగుతాడాని అన్నారు. ఇప్పటి వరకు 5 లక్షల సభ్యత్వాలు ఉండగా దాన్ని 10 నుండి 15 లక్షల సభ్యత్వాలు అయ్యేందుకు కృషి చేస్తామని తెలిపారు.