పలు నూతన రోడ్లు ను ప్రారంభించిన ఎమ్మల్యే తోయాక జగదీశ్వరి..

కూటమి ప్రభుత్వం తోనే అభివృద్ధి ఎమ్మెల్యే

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం  లో నిర్మాణం పూర్తి అయిన పలు రోడ్లు కురుపాం పంచాయతీ లో తోటపల్లి గుణుపూర్ రహదారి నుండి సీతంపేట గ్రామం వరకు 70 లక్షల రూపాయల వ్యయంతో1.08 కిలోమీటర్లు నిర్మించిన తారు రోడ్డు ను, మరియ మండలంలో గుమ్మ పంచాయతీ తోటపల్లి గుణుపూర్ రహదారి నుండి కోన గూడ గ్రామం వరకు 1.2 లక్షల రూపాయల వ్యయంతో 1420 మీటర్లు నిర్మించిన తారు రోడ్డు నునియోజవర్గ ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రారంభించారు

..ఆమె మాట్లాడుతూ నియోజక వర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని కూటమి ప్రభుత్వం లో హామీలు అన్ని నెరవేరుతాయని అన్నారు,ఆమె వెంట నియోజక వర్గ నాయకులు,మాజీ ఎ ఏం సి చైర్మన్లు కోలా రంజిత్ కుమార్ డొంకాడ రామకృష్ణ,  మాజీ గ్రంథాలయ చైర్ పర్సన్ దత్తి లక్ష్మణరావు టిఎన్ఎస్ఎఫ్ మీడియా కోఆర్డినేటర్ సుకేష్ చంద్ర పండా మరియు అధికారులు ఇతర నాయకులు అభిమానులు ఉన్నారు

About The Author: PRUDVIRAJ.M

 మన్యం జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.