అరుల్మిగు సోలైమలై మురుగన్‌ సేవలో  పవన్‌ కళ్యాణ్‌

pawan-kalyan-at-arulmigu-solimalai-murugan-service

 పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అధికారులు
 క్షేత్ర విశిష్టతను వివరించిన అర్చకులు  



 మధురై, పెన్ పవర్ ఫిబ్రవరి 15:
షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్రలో భాగంగా శనివారం ఉదయం తమిళనాడు రాష్ట్రం మధురై జిల్లాలో అళగర్‌  కొండల్లో కొలువైన పలముదిర్చోలై అరుల్మిగు సోలైమలై మురుగన్‌ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్‌ కళ్యాణ్రు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారికి పూలమాలలు, శాలువాతో సత్కరించి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయానికి అనుగుణంగా మురుగన్‌ కు  పవన్‌ కళ్యాణ్‌  ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం క్షేత్ర విశిష్టతను ఆలయ అర్చకులు  పవన్‌ కళ్యాణ్‌ కి వివరించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయంలో జరుగుతున్న స్కంద షష్టి కవచం, తిరుప్పుకల్‌ పారాయణంలో ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు

About The Author: Admin