పెద్ద దోర్నాల ,పెన్ పవర్ జూలై 18:
కౌలు రైతులకు ప్రభుత్వం మంజూరు చేయనున్న సి సి ఆర్ సి కార్డులపై కౌలు రైతులకు అవగాహన కల్పించేందుకు గురువారం మండలంలోని యడవల్లి అలాగే దోర్నాల 3 రైతు సేవా కేంద్ర పరిధిలో మండల వ్యవసాయ అధికారిని డి. జవహార్ లాల్ నాయక్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయ అధికారి జవహార్ లాల్ నాయక్ మాట్లాడుతూ పౌలు రైతులకు సిసిఆర్ సి పత్రాలు పంపిణీ చేశామని అన్నారు చేయడం జరిగింది భూమి యజమాని నుంచి భూమిని కౌలుకు తీసుకునే కౌలు రైతులు భూమి యజమాని నుంచి అగ్రిమెంటు చేసుకోవాలని, దానితోపాటు భూమి యజమాని ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీ ని కూడా పొందాలని వివరించారు. కౌలు చేసుకునే భూమిపై క్రయ,విక్రయాలు ,ముటేషన్, భూమి తనఖా పెట్టి బ్యాంకుల ద్వారా రుణాలు పొందటం, తదితర హక్కులు కేవలం భూమి యజమానికి మాత్రమే ఉంటాయని, అయితే భూమి యజమానులకు ప్రభుత్వ పరంగా అందే అన్ని సబ్సిడీ పథకాలు కౌలు రైతులకు వర్తిస్తాయని వివరించారు. కౌలు రైతులు కేవలం తమ సాగు చేస్తున్న పంటపై మాత్రమే బ్యాంకుల ద్వారా రుణాలు పొందవచ్చని ,పంట సాగు దిగుబడి పై కౌలు రైతులకు హక్కు ఉంటుందని ఆయన తెలిపారు. భూమి యజమాని ద్వారా చేసుకున్న అగ్రిమెంట్ కాల పరిమితి కేవలం 11 మాసాలు మాత్రమే ఉంటుందని వారు చెప్పారు. కావున కౌలు రైతులు భూమి యజమాని నుంచి పొందిన అగ్రిమెంటు ,ఆధార్ కార్డు ,పట్టాదారు పుస్తకం జిరాక్స్ కాపీలతోపాటు కౌలు రైతు యొక్క ఆధార్ కార్డు ,బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలు ,ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో లను సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారికి అందజేయాలని తెలిపారు.ఆ మేరకు వాటిని పరిశీలించి అర్హులైన కౌలు రైతులకు సిసిఆర్సి కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ పంచాయతీల వీఆర్వోలు, వ్యవసాయ వి ఏ ఏలు, కౌలు రైతులు తదితరులు పాల్గొన్నారు.