ఒంగోలు 37వ డివిజన్ కు చెందిన వైసీపీ కార్పొరేటర్ చెన్నూపాటి వేణుగోపాల్ సోదరులు చెన్నూపాటి వరప్రసాద్, చెన్నూపాటి హరిబాబు, చెన్నూపాటి శ్రీనివాస్ లు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మరియు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి సమక్షంలో టీడీపీ లోకి చేరారు. వారితో పాటు వారి అనుచరులు మరియు కుటుంబ సభ్యులు సుమారుగా 200 మంది వైసీపీని వీడి టీడీపీ లోకి రావడం జరిగినది. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమం లో నగర మరియు డివిజన్ టీడీపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.