అంతర్జాతీయ సేవా నట సామ్రాట్ భూషణ్ పురస్కారం అందుకున్న డాక్టర్ మద్దాలి మాధవరావు

స్టాఫ్ రిపోర్టర్,పెన్ పవర్,ఒంగోలు, జూలై,18.

లిటిల్ చాంప్స్ అకాడమీ ఆఫ్ ఇండియా మరియు ఎల్.సి.ఎస్.ఫౌండేషన్ సంయుక్తంగా శ్రీశైలం దేవస్థానంలోని కళావేదిక ప్రాంగణంలో జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  శ్రీ అభయ సేవ ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మద్దాలి మాధవరావుకు "అంతర్జాతీయ సేవా నట సామ్రాట్ భూషణ్" పురస్కారం ను దేవాలయ కార్యనిర్వాహకధికారి పెద్దిరాజు మరియు దేవాలయ కార్యనిర్వహణ సిబ్బంది చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో గౌరవ అతిధులుగా ఎన్.హెచ్.ఆర్.ఓ. వర్కింగ్ ప్రెసిడెంట్ రాంచందర్ ఎన్.హెచ్.ఆర్.ఓ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.శేఖర్ అలానే ఇమ్మడిశెట్టి హనుమంతరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎల్సిఎస్ ఫౌండేషన్ హైదరాబాద్ వారు మాట్లాడుతూ ప్రకాశం జిల్లా చీమకుర్తికు చెందిన డాక్టర్ మద్దాలి మాధవరావు ఇప్పటివరకు 4000 సేవా కార్యక్రమాలతో పాటు, 600 పురస్కారాలు తో పాటు రజక పత్రాలు 30, 25 స్వర్ణ కంకణాలు 25 నంది పురస్కారాలు, ఆరు గౌరవ డాక్టరేట్స్ అందుకోవటం తో పాటు 25 బిరుదులు, లైఫ్ టైం అచీవ్మెంట్  అవార్డ్స్ 45 అందుకోవడం గొప్ప విషయమని,కేవలం మాధవరావుకే  సాధ్యమవుతుందని అన్నారు.అనంతరం లిటిల్ చాంప్స్  అకాడమీ ఆఫ్ ఇండియా సెక్రెటరీ బుచ్చేశ్వరావు మాట్లాడుతూ మద్దాలి మాధవరావుకు కష్టాలేమి కొత్తవి కాదని, నిండు మనసుతో సాయం చేయటంలో తనకంటూ ప్రత్యేకమైన శైలి ఏర్పాటు చేసుకున్నారని, ఆకలి వేసిన ప్రతి వాడి కడుపున నింపే నింపడమే ఆయన లక్ష్యమని అలానే ఎందరికో స్ఫూర్తిదాతవుగా నిలిచారని డాక్టర్ మధ్ధాలి మాధవరావు ను ప్రశంసించారు.ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదరించి వారికి కావలసిన నిత్యవసరం సరుకులతో పాటు అనేకమంది విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేపట్టి దివ్యాంగులకు వీల్ చైన్లను అందజేశారు.అలానే చీమకుర్తి పట్టణంలో ఘంటసాల విగ్రహం ఏర్పాటు చేశారని ఇప్పుడు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహం ను త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమాలు చేయటం ఆషామాషీ విషయం కాదని తెలిపారు. అలానే డాక్టర్  మద్దళి చేస్తున్న సేవలను గుర్తించి జాతీయం కూచిపూడి నాట్య సమ్మేళనం లో అంతర్జాతీయ సేవ నట సామ్రాట్ భూషణ్ పురస్కారము ఫౌండేషన్ సభ్యులు అందజేశారు. అనంతరం ఆయనను సత్కరించి మేమెంటో, సర్టిఫికెట్, అందజేసి గౌరవ సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో విద్యావేత్త డాక్టర్ కొలకలూరి రవిబాబు, కళా విభూషణ్ సామ్రాట్, సినిగేయ రచయిత డాక్టర్ మధుర శ్రీ, షేక్ నాసిర్ అహ్మద్ తో పాటు మద్దాలకి పలు స్వచ్ఛంద సంస్థలు,జిల్లాలోని కళాకారులు,అభిమానులు పలువురు బ్రాహ్మణ సంఘం నాయకులు అభినందనలు తెలియజేశారు.

About The Author: Admin