రంజాన్ ప్రత్యేక ప్రార్థనలకు ముస్తాబైన ఈద్గాలు

బుధవారం తో ముగిసిన రంజాన్ ఉపవాసాలు.
కనిపించిన శవ్వాల్ నెల నెలవంక. 
పరస్పరం ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్న ముస్లింలు. 
గురువారం రంజాన్ పర్వదినాన్ని జరుపుకునేందుకు ఏర్పాట్లు.
గ్రామాల వెలుపలగల ఈద్గాలను ప్రార్థనకు సిద్ధం చేసిన మసీదు కమిటీ సభ్యులు.

రంజాన్ పర్వదిన ప్రత్యేక ప్రార్థనలను జరుపుకునేందుకు గ్రామాల వెలుపలగల ఈద్గాలు ముస్తాబయ్యాయి .గత నెల 11వ వ తేదీతో ప్రారంభమైన రంజాన్ మాసం ఈనెల 10వ తేదీతో ముగిసింది .ఆ సందర్భంగా గత నెల 12వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ముస్లింలు 30 రోజులపాటు ఉపవాస దీక్షలో గడిపారు .మండే ఎండలను ,భయంకరమైన వడగాడుపులను భరిస్తూ 30 రోజులపాటు చేపట్టిన కాఠోర ఉపవాస దీక్షలు ఈనెల 10వ తేదీతో మూశాయి. ఇక బుధవారం సాయంత్రం శవ్వాల్ నెల వంక కనిపించింది .దీనితో ముస్లింలు పరస్పరం  ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు .గురువారం రంజాన్ పర్వదినాన్ని జరుపుకునేందుకు ఏర్పాట్లలో మునిగిపోయారు .ఇప్పటికే రంజాన్ పర్వదినం కోసం నివాస గృహాలను అందంగా అలంకరించారు .నూతన దుస్తులను కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకున్నారు .మత పెద్దలు సూచనల మేరకు ఒక్కొక్క వ్యక్తికి వంద రూపాయలు చొప్పున  ఫిత్రాలు తీసి పేదలకు పంపిణీ చేశారు. ఇక ధనవంతులు జకాత్లను కూడా పేదలకు అందజేశారు. అనేకమంది దాతలు పేదలకు నూతన దుస్తులను ఉచితంగా పంపిణీ చేశారు. గురువారం రంజాన్ పర్వదినాన్ని జరుపుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు అన్ని పూర్తి చేసుకున్నారు. గురువారం ఉదయం 9 గంటల సమయంలో ఆయా గ్రామాలలోని ముస్లింలు మసీదులు వద్దకు చేరి అక్కడినుండి అల్లాను ప్రార్థిస్తూ, తక్బీర్ చదువుతూ గ్రామాల వెలుపలగల ఈద్గాల వద్దకు చేరుకుంటారు .అక్కడ మత పెద్దల ఆధ్వర్యంలో సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తారు. చిన్న పెద్ద ,ధనికా పేద తేడా లేకుండా అందరూ ఒకే చోట చేరి రంజాన్ ప్రార్థనలో పాల్గొంటారు. 
ఆ సందర్భంగా  రంజాన్ పర్వదిన ప్రాముఖ్యతను వివరిస్తూ మత పెద్దలు ఆధ్యాత్మిక ఉపన్యాసం చేస్తారు. కొమరోలు మండలంలోని కొమరోలు, అల్లినగరం, రెడ్డి చర్ల, రాజుపాలెం ,నల్లగుంట్ల, హనుమంతురాయనిపల్లె ,దద్దవాడ, ఎడమ కళ్ళు తదితర గ్రామాల వెలుపల గల ఈద్గాలను రంజాన్ ప్రార్థనలకు సిద్ధం చేశారు. 
 

About The Author: Admin