కావలి పట్టణంలో స్థానిక శ్రీరామ్ థియేటర్ రోడ్డులో కనకదుర్గ గోల్డ్ లోన్ అనే ఒక ఫైనాన్స్ కంపెనీ నడపబడుతుంది. ఈ కంపెనీ బంగారు తనకాపెడితే ఖాతాదారులకు లోన్ ఇస్తుంది. అయితే ఇది కావలిలో స్థాపించి సుమారు 10 మాసాలవుతుంది. ఈ కంపెనీలో ఇద్దరు మేనేజర్లు ఒక అప్రైజరు ఒకరు అకౌంటెంట్ ఉంటారు. అయితే బంగారం కుదవపెట్టుకొని డబ్బులు ఇచ్చే వ్యాపారం చేస్తూ ఉంటారు. ఈ కంపెనీ పనే వ్యాపారం చేయడం. అయితే ఖాతాదారులు దగ్గర ఈ కంపెనీలో పనిచేసే వ్యక్తులు బంగారం తీసుకొని డబ్బులు ఇవ్వకుండా రాత్రికి రాత్రి ఊడయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఖాతాదారులు కనకదుర్గ గోల్డ్ లోన్ ఆఫీస్ కి వెళ్లి తనకాపేట్టిన బంగారు వస్తువులను అడిగితే సంబంధిత సిబ్బంది సక్రమంగా సమాధానం చెప్పకపోవడంతో లబోదిబోమంటున్న ఖాతాదారులు, ఈ ఫైనాన్స్ లో తనకా పెట్టిన కోటి రూపాయలు వరకు బంగారం మాయమైనట్లు సమాచారం. పనిచేస్తున్న సిబ్బంది చేతివాటం చూపించి పరారైనట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరి ఖాతాదారుల పరిస్థితి ఏమిటో... అసలు ఆ కంపెనీలో ఏం జరిగిందో... ఈ పేరుతో ఉండే రాష్ట్రంలో అన్ని కంపెనీల మోసం బయటకు తీయాలని బాధితులు కోరుతున్నారు.