ఎడిటర్, పెన్ పవర్ పుల్లల చెరువు ఆగస్టు 13
అధికారం చేతిలో ఉంటే...ఆపార్టి నాయకుల అండ దండలుంటే ఏమైన చేయవచ్చు అంటు విధ్యాకమీటి చైర్మేన్ ఎన్నికలనే అభాసు పాలు చేసి,విధ్యాకమీటి ఎన్నికల విషయంలో కొత్తవిధానానికి తెరలేపిన సంఘటన చర్చాంశనీయం మారింది.పుల్లల చెరువు మండల కేంద్రము కేజీబీవీ పాఠశాలలో అధికార పార్టీ రాజ్యమేలుతుందంటే నిజమే అనిపిస్తుంది.గత 8వ తేదీ గురువారం జరిగిన స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ లో పుల్లల చెరువు మండల కేంద్రము కేజీబీవీ పాఠశాలలో పిల్లలు లేని వ్యక్తీకి స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ పదవిని కేజీబీవీ పాఠశాల యస్ ఒ కట్టబెట్టిన సంఘటన ఆల్యంగా వెలుగులోకి వచ్చింది.పాఠశాలలు, విద్యార్థుల అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి ఏర్పాటు చేసిన పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు పూర్తి ఏకపక్షంగా జరిగేలా అధికార టీడీపీ నేతలు యథేచ్ఛగా దౌర్జన్యంగా అధికార దర్పణం సాగించారు. తాము చెప్పిన వారినే చైర్మన్ చేయాలని టీడీపీ నేతలు హుకుం జారీ చేశారు. పిల్లల బడిలో పెద్దల పెత్తనం చెలాయిస్తూ అధికారంలో ఉంటే ఏదైనా చెయవచ్చుఅన్న సామెతను నిజం చేస్తూ అధికార కూటమి నాయకులు లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్లు సృష్టించటంలో ఆరితెరారు వారీకి వత్తాసు పలుకుతూ ప్రభుత్వ జీ ఒ ను తుంగలో తొక్కుతూ అధికార పార్టీ నాయకులకు సపోర్ట్ చేసి స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ పదవిని పుల్లల చెరువు కేజీబీవీ పాఠశాల యస్ ఒ కట్టబెట్టిందని విశ్వశనీయ సమాచారం. బాహుబలి చిత్రంలో శివగామి అవతారం ఎత్తి నేను చెప్పిందే వేదం నేను రాసేది శాసనం అన్నటు వ్యవహరిస్తున్నా తీరు చూసి విద్యార్థినీ తల్లిదండ్రులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇటువంటి అధికారిని పై చర్యలు తీసుకునే అధికారులే లేరా... అంతే కాదు ఈమె గత 12 సంవత్సరాల కిందట నుండీ ఇదే పాఠశాలలో పనిచేస్తున్నా ఈమెకి బదిలీలు అన్న మాట తెలియదు. ఏ పార్టి అధికారంలో ఉంటే ఆపార్టి నాయకుల మాటలు వింటూ, విధేయత చూపుతుండటంపై ఇప్పటివరకు స్దాన చలనం లేకుండా పోయింది.
కూటమి ప్రభుత్వ జీ ఓ కాదని: కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్శకంగా పాఠశాలల అభివృధ్ధి కోసం విధ్యాకమీటి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించినా.. పుల్లలచెరువు కస్తూరభాగాంధి పాఠశాలలో మాత్రం యస్ ఓ నూతన జీఓ అమలు చేసి పెళ్ళికాని.. పిల్లలులేని... పసుపు సేనానికి చైర్మేన్ గా ప్రకటించడం విశేషం.
ఈ విషయం పై స్పెషల్ ఆఫీసర్ లిల్లీ ప్రకాష్ వాణీ నీ వివరణ కోరగా ఎవరైతేనేమి స్కూల్ బాగోగులు చూసుకునేందుకు అని సమాధానం ఇచ్చింది. పిల్లలకు సంరక్షకుడుగా ఉంటున్నాడు అంటూ దాటవేసింది. ఈ విషయాన్ని అనవసరంగా వివాదం చేయవద్దని హెచ్చరిక దోరణితో మాటలాడారు.