చలివేంద్రం ప్రారంభించిన పేతురు

 పామూరు పట్టణంలో పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ  సంఘం ఆధ్వర్యంలో సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు గుంటగాని పేతురు  ముఖ్య అతిథిగా పాల్గొని  కూలింగ్ వాటర్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాసేవ కోసం సంఘము ముఖ్య నాయకులు సంఘ సభ్యులు కృషిని కృషి మరువలేనిది అన్నారు.   భవిష్యత్తులో మనందరం కలిసి ప్రజాసేవ కోసం మరెన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని  పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు కోడిగుంపల నాయిబ్ రసూల్, సంఘం జిల్లా అధ్యక్షులు బద్దెపూడి  మార్కు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  లోకసాని  రవికుమార్ ప్రకాశం జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు జగన్నాథం మల్లికార్జున  జగదాబి సునీల్  డివిజన్ అధ్యక్షులు ఇశ్రాయేలు   మండల ప్రధాన కార్యదర్శి కాశయ్య పామూరు మండల మహిళా అధ్యక్షురాలు జక్కుల వెంకటలక్ష్మి  సంఘ సభ్యులు సాయి ఎలమంద నాయిబా, మోహన్ నేలపాటి మాలాద్రి మరియమ్మ పురుషోత్తం దానయ్య మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

About The Author: Admin