పొదిలి, పెన్ పవర్ జూలై 18:
హెల్మెట్ ధరించి వాహన ప్రయాణం చేయడం అన్ని విధాల ఎంతో శ్రేయస్కరమని పొదిలి జూనియర్ సివిల్ జడ్జి ప్రత్యూష స్పష్టం చేశారు గురువారం నాడు ప్రకాశం జిల్లా న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై పొదిలి పట్టణంలో అవగాహన ర్యాలీ జరిగింది ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జూనియర్ సివిల్ జడ్జి ప్రత్యూష మాట్లాడుతూ హెల్మెట్ ధరించి వాహన ప్రయాణం చేయడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు వాహన ప్రయాణం చేసేటప్పుడు సెల్ ఫోన్ తో మాట్లాడడం, ఇయర్ ఫోన్స్ వినియోగించడం లాంటి వాటిని పాల్పడకూడదని ఆమె తెలిపారు వాహనదారులు సురక్షితంగా గమ్యస్థానానికి చేరాలన్నా తలంపుతో ప్రయాణం చేయాలని, ప్రయాణ సమయంలో అవసరమైన జాగ్రత్తలను తీసుకుంటే ప్రమాదాలు నివారించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు అధిక స్పీడు, నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం ప్రమాదాలకు మూల కారణమని న్యాయమూర్తి ప్రత్యూష చెప్పారు ఈ కార్యక్రమంలో పొదిలి పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ డి మల్లికార్జున రావు, పొదిలి మండల పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ జి కోటయ్య, బార్ అసోసియేషన్ నాయకులు ఎం.వి రమణ కిషోర్, షేక్ షబ్బీర్, ఎస్ ఎం భాష తోపాటు పలువురు న్యాయవాదులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
హెల్మెట్ ధారణ తో ప్రయాణం అన్ని విధాల శ్రేయస్కరం
పొదిలి జూనియర్ సివిల్ జడ్జి ప్రత్యూష స్పష్టం