అల్లూరి జిల్లా దేవిపట్నం మండలంలోని దామనపల్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను బుధవారం ఏటిడబ్ల్యుఓ రామతులసి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా 6వ తరగతి నుండి 9 తరగతి విద్యార్థులకు జరుగుతున్న పరీక్షలను పరిశీలించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. విద్యార్థులతో మెనూ విషయాలు అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు.అనంతరం ఏటిడబ్ల్యుఓ రామతులసి మాట్లాడుతూ విద్యార్థులు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చారు.మెనూ ప్రకారం ఆహారాన్ని వేడిగా విద్యార్థులకు వడ్డించాలని, వార్డెన్ ను ఆదేశించారు.తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి నైపుణ్యాలను పరీక్షించడం జరిగింది. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల విద్యార్థుల ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యార్థులు డిహైడ్రేషన్ గురికాకుండా గ్లూకోజ్ వంటి పానీయాలు ఎప్పటికప్పుడు అందించాలని కోరారు. అదేవిధంగా పాఠశాల రికార్డులను పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు.
దామనపల్లి ఆశ్రమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ....
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.