ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తోనే పేదల సంక్షేమం సాధ్యమని గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి, కుందూరు నాగార్జున రెడ్డి సతీమణి కల్పనా రెడ్డి ప్రజలకు తెలిపారు. బుధవారం గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని 3వ వార్డులో ప్రతి ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి వేయించి గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. నాటి ప్రజా సంకల్ప పాదయాత్రలో జగనన్న పలువురి సమస్యలు తెలుసుకొని ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా గడప - గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా నెరవేర్చారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి - సంక్షేమం రెండు కళ్లుగా జగనన్న పాలన అందిస్తున్నరన్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా తన భర్త ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి కి మద్దతూ తెలపాలని కోరుతూ కల్పనా రెడ్డి కుటుంబ సభ్యులు,మండల,నగర పంచాయితీ ముఖ్య నాయకులు, మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు.ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నగర పంచాయితీ నాయకులు చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, వైస్ చైర్మన్ లు ఆర్డీ రామకృష్ణా రావు, కాతా దీపిక, జేసిఎస్ టౌన్ కన్వీనర్ ఈశ్వర్ నాయుడు, బాదాం గోపాల్,కో - ఆప్షన్ షేక్ మస్తాన్ వలీ ,కౌన్సిలర్లు దొంతా లక్ష్మీదేవి , మత్తయ్య, శ్రీ రాములు, మానం బాలి రెడ్డి,ముద్దర్ల శ్రీను,నాసరి శ్రీను,పోలేపల్లి శివ,శెక్షవలి,పెద్ద వలీ, గర్రే సుబ్బారావు, ఖాతా నరసింహ రావు, నాగేశ్వరరావు,కోటా సత్యం, పాండు రంగా రెడ్డి, గుళ్ళ రామకృష్ణ రెడ్డి, చేరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, కంచిపల్లే సర్పంచి సమాధుల రాజేశ్వరి, బండారునిర్మలా దేవి, రమాదేవి,అనసూయమ్మ, హారూన్ రషీద్,అంబవరపు శ్రీకాంత్ రెడ్డి, సూరేపల్లి రామకృష్ణ, వెంకటరావు, గర్రే వెంకటేశ్వర్లు, గఫూర్, పాలుగుల్ల నరసింహ రెడ్డి, సుబ్బారెడ్డి, కలువ సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.
వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తోనే పేదల సంక్షేమం సాథ్యం
కుందూరు కల్పనారెడ్డి
రాష్ట్రంలో అభివృద్ధి - సంక్షేమం
రెండు కళ్లుగా జగనన్న పాలన