గిద్దలూరు నియోజకవర్గం లోని బేస్తవారిపేట ఆంధ్రప్రభ విలేకరి రంగస్వామి పై మంగళవారం దాడి చేయటం హేయమైన చర్య యని గిద్దలూరు పాత్రికేయులు తీవ్రంగా ఖండించారు దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బెస్తవారిపేట లోని ఓ టీ కొట్టు వద్ద మూల నారాయణరెడ్డి అనే వ్యక్తి విలేకరులను దూషిస్తూ మాట్లాడుతుండగా అక్కడే ఉన్న ఆంధ్రప్రభ విలేకరి రంగస్వామి విలేకరులు అందరిని దూషించడం సరికాదని చెప్పడంతో ఆగ్రహించిన మూల నారాయణరెడ్డి రంగస్వామి పై దాడి చేశాడు. ఈ దాడిలో ఆంధ్రప్రభ విలేకరి రంగస్వామి తీవ్రంగా గాయపడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దాడిని గిద్దలూరు విలేకరులు ఖండించారు దాడి చేసిన మూల నారాయణరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని పలువురు డిమాండ్ చేశారు.