ప్రజల జీవితాల్లో వెలుగు నింపడమే లక్ష్యంగా తెలుగుదేశం జనసేన బిజెపి అద్భుతమైన మేనిఫెస్టో రూపకల్పన చేసిందని శ్రీ కాళహస్తి తెదేపా నాయుడు లక్కమనేని మధు అన్నారు.
ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తెదేపా, జనసేన, భాజపా ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూటమి మ్యెనిఫేస్ట్ అమలు ద్వారా ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు 15000 చొప్పున అందించడం జరుగుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాది కి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు,డ్వాక్రా కింద పది లక్షల వరకు సున్నా వడ్డీ అమలు చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్క యువకుడికి ఉద్యోగం ఇచ్చే విధంగా చంద్రబాబు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని, మెగా డీఎస్సీ పై తొలి సంతకం, వాలంటీర్లకు పదివేలు గౌరవ వేతనం ఇవ్వడం, ఐదేళ్లలో 20 లక్షలు ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. నిరుద్యోగులకు ప్రతినెల 3000 చొప్పున నిరుద్యోగ భృతి,బీసీ డీక్లరేషన్లో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామన్నారు. ఎన్టీఆర్ పెన్షన్ అమలు చేస్తే దానిని తెలుగుదేశం 200 ఉన్న పెన్షన్ 2000 చేయడం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగువేల పెన్షన్ అందిస్తామని ఏప్రిల్ నుండే అమలు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరికి 25 లక్షల ఆరోగ్య భీమా అమలు చేయడం కోసం కూటమి ప్రత్యేక మేనిఫెస్టో కూటమి రూపొందించిందన్నారు. ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు 10 లక్షలు బీమా అందిస్తామన్నారు. జే బ్రాండ్స్ రాష్ట్రంలో నిలిపివేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతామన్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం బీసీ సోదరులకు తీరని అన్యాయం చేసిందన్నారు. సరైన ఆర్థిక ప్రణాళిక లేని వైసిపి ప్రభుత్వం బీసీలకు రావాల్సిన వాటా నిధులని దారి మళ్ళించిందని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీసీలను అక్కున చేర్చుకున్నారు. బీసీలకు ఆదరణ లాంటి పథకాలను తీసుకువచ్చి ఆదుకున్నాం . బీసీ కార్పొరేషన్ ద్వారా 50% సబ్సిడీతో లోన్లు ఇప్పించిన ఘనత టిడిపి ప్రభుత్వానిదే అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ విదేశీ విద్య ద్వారా వేలాది మంది విద్యార్థుల విదేశీ విద్య కలలు నెరవేర్చిందన్నారు. బీసీ బిడ్డలకు చంద్రన్న పెళ్లి కానుక అందించి ఆదుకున్నామన్నారు. చదువుకున్న బీసీ యువతకు ఏపీ స్టడీ సర్కిల్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా ఉపాధి కల్పించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే అన్నారు. ప్రస్తుత జగన్ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల లో రిజర్వేషన్లు తగ్గించి రాజ్యాంగబద్ధ పదవులను దూరం చేసిందన్నారు.కూటమి అధికారంలోకి రాగానే బీసీలకు కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇప్పించడం ఆదరణ పథకాన్ని మళ్లీ పునరుద్ధరించడం బీసీ జన గణన చేపట్టడం చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం జరుగుతుందన్నారు.అలాగే ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక రక్షణ చట్టం ఎలా ఉందో బీసీలకు కూడా బీసీ రక్షణ చట్టాన్ని తీసుకువస్తామన్నారు. బీసీ బిడ్డలకి చంద్రన్న పెళ్లి కానుక, చదువుకున్న బీసీ యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా స్కిల్స్ నేర్పించి ఉపాధి కల్పిస్తామన్నారు. శ్రీ కాళహస్తి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న బొజ్జల సుధీర్ రెడ్డి కి సైకిల్ గుర్తుకు, తిరుపతి పార్లమెంటు అభ్యర్థి వరప్రసాద్ కు కమలం గుర్తుకు ఓటె వేసి గెలిపించి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ను ముఖ్యమంత్రి చేసుకోవాలని, కేంద్రంలో నరేంద్ర మోడీ ని మరో సారి గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే కూటమి మేనిఫెస్టో లక్ష్యం.
మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు ఆర్థిక భరోసా.
శ్రీ కాళహస్తి తెదేపా నాయకుడు లక్కమనేని మధు.
శ్రీ కాళహస్తి