తిరుపతి తుడా చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి డాలర్స్ గ్రూప్స్ అధినేత డాలర్స్ దివాకర్ రెడ్డి పేరు దాదాపు ఖరారు అయిందనీ సమాచారం. ఇప్పటికే తిరుపతి నుండి సీనియర్ నాయకులు పోటీపడుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తుడా చైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారని తెలిసింది. గత ఎన్నికల్లో చంద్రగిరి తిరుపతి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి భారీ మెజార్టీని దివాకర్ రెడ్డి అందించారు. చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ తాను ఆశించిన చివరి నిమిషంలో నారా లోకేష్ సర్ది చెప్పడంతో పోటీ నుండి విరమించుకున్నారు. అధిష్టానం మాట విని క్రమశిక్షణతో పార్టీ కోసం కష్టపడిన డాలర్స్ దివాకర్ రెడ్డిని తిరుపతి తుడా చైర్మన్ గా ప్రకటించనున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో డాలర్స్ దివాకర్ రెడ్డి తిరుపతి తుడా చైర్మన్ అని సమాచారం హల్చల్ అవుతుండడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
తుడా చైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి?
tuda-chairman-divor-diwakar-reddy
అధిష్టానం నుండి దాదాపు ఖరారు
సంబరాలలో డాలర్స్ అభిమానులు