జీవీఎంసీ పరిధి 76వ వార్డు వైసీపీ ఇంచార్జ్ దొడ్డి రమణ ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి, గాజువాక వైఎస్ఆర్సిపి అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ ఎన్నికల ప్రచారానికి జనం ప్రభంజనమై తరలివస్తోంది. రోజురోజుకు అమర్నాథ్ వెంట నడిచేందుకు పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు. ముఖ్యంగా మహిళలు అశేషంగా తరలివచ్చి ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ 76వ వార్డు లోని నడుపూరు తదితర ప్రాంతాలలో ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచార స్థలానికి అమర్నాథ్ చేరుకోగానే మహిళలు, పెద్దలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా మంత్రి అమర్నాథ్ ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. తనను గెలిపిస్తే ఈ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు తీసుకు వస్తానని విశాఖ నగరానికి దీటుగా గాజువాకను తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. పారిశ్రామిక ప్రాంతంలో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరిస్తానన్నారు. పెద్దలు నాగిరెడ్డి, చింతలపూడి వెంకట రామయ్య , మాజీ గాజువాకవైసీపీ ఇన్చార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, మాజీ గాజువాక సమన్వయకర్త ఉరుకోటి చందులను కలుపుకొని అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. అలాగే పార్టీ కోసం కష్టపడిన వారికి సమచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ, చిక్క సత్యనారాయణ, రంభ నారాయణమూర్తి, తాటికొండ జగదీష్, తాటికొండ అచ్యుత్, కులుకూరి మంగ రాజు,అనపర్తి రమణ, మొలకలపల్లి ప్రసాద్, రావాడ భవాని, శ్రీకాంత్, అండిబోయిన సన్ని, కాక్కుళ్ల మురళి, దీని శెట్టి చిన్నారావు, బ్రహ్మానంద రెడ్డి,కే. బాలాజీ, నాగు, పార్వతి, పరంకుసం ప్రమీల, నరసింహమూర్తి, పెంటకొట నాగేశ్వర రావు,ఆర్.వేణుగోపాల్ రావు, ములకలపల్లి అశోక్, కాకినాడ పెంటారావు, మంత్రి మంజుల, గొరుసు రామలక్ష్మి, పప్పల పుష్ప, తిప్పల స్వాతి, గొంప రమేష్, రామ జ్యోతి, పత్రి దేవి, ఆర్.రేవతి, అధిక సంఖ్యలో పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.
విస్తృత ప్రచారంలో పాల్గొన్న అమర్
ప్రచారంలో పాల్గొన్న మహిళలు, యువత 76వ వార్డులో హోరెత్తిన ఎన్నికల ప్రచారం.