విశాఖ నగరం నడిబొట్టిన ద్వారకానగర్ ద్వారకా నగర్ లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు వివరాల్లోకి వెళితే ఐఓబి బ్యాంకులో గన్ మాన్ గా విధులు నిర్వహిస్తున్న శంకర్రావు గురువారం ఉదయం యధావిధిగా డ్యూటీ కి హాజరైయ్యాడు, ఏమైందో ఏమో తెలియదు కానీ ఎవరూ లేని సమయంలో తమ రెస్ట్ రూమ్ లో తను విధులు నిర్వహిస్తున్న తుపాకి తోనే తను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సెకండ్ల వ్యవధిలోనే ప్రాణాలు విడిచాడు శంకర్రావు..గన్ శబ్దం విని హుటాహుటిన లోనికి వచ్చిన మిగతా ముగ్గురు కానిస్టేబుళ్లు.. అప్పటికే
ప్రాణాలు కోల్పోయాడని తోటి గాడ్స్ తెలిపారు.
తన వద్ద ఉన్న ఎస్ఎల్అర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు ద్వారకానగర్ పోలీసులు.. శంకర్రావు సిటీలోని మద్దిలపాలెం చెందినవాడిగా గుర్తించారు బ్యాంక్ అధికారులు.ఎస్ ఎల్ ఆర్ గన్ తో 7.62 ఏం.ఏం బుల్లెట్ తో ఎడం వైపు ఛాతి లోకి కాల్చుకొని మృతి చెందాడు శంకర్రావు ఇతని వయసు (39)గా గుర్తించిన బ్యాంక్ అదికారులు, ఇతను మద్దిలపాలెం వద్ద శివాజిపాలెం లో కుటుంబంతో నివాసిస్తున్నాడని,శంకరరావుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని సమాచారం భార్య పేరు శ్రావణి, బాబు కిషోర్ చంద్రాదేవ్, కూతురు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ద్వారకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ద్వారకా పోలీసులు.. సీ సీ వీడియో ఫుటేజ్ కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.