పత్రికా ప్రచురణార్ధం

విజియనగరం పెన్ పవర్ 

మట్టిపరిమళ కవిత్వం కవుల నుంచి పుట్టుకురావాలి: ఆచార్య కొలకలూరి ఇనాక్ 

తెలుగు వెలుగు సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు కవితార్చన 

అత్యంత వైభవంగా శ్రీరామ నవమి కవితా వసంతోత్సవం

తెలుగు వెలుగు సాహిత్య జాతీయ వేదిక ఆధ్వర్యంలో ఉగాది కవిత వసంత సమ్మేళనం జరిగింది ఆదివారం నుండి బుధవారం వరకు నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగింది.  ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథులుగా  శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్,పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు నాళేశ్వరం  శంకరం, సినీ గేయ రచయిత,నంది అవార్డు గ్రహీత సాదనాల వేంకట స్వామి నాయుడు, ట్యాగ్ లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి, తెలుగు వెలుగు సాహిత్య వేదిక జాతీయ గౌరవ అధ్యక్షులు గంట మనోహర్ రెడ్డి తదితరులు  పాల్గొన్నారు. తెలుగు వెలుగు సాహిత్య వేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్  పిఆర్ ఎస్ ఎస్ ఎన్ మూర్తి , జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోటూరి నారాయణరావు నిర్వాహణా సారధ్యంలో నాలుగు రోజుల పాటు జరిగిన అంతర్జాల కవి సమ్మేళనంలో  ద్విశతక కవులు హజరై తమ కవనాలను వినిపించారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్,పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ .. 

కవిసమ్మేళనంలో మూడవరోజు జరిగిన కార్యక్రమానికి  విశిష్ట అతిథిగా సాహితీ దిగ్గజం,కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు హాజరయ్యారు.
 ఈయన మాట్లాడుతూ కవిత్వం యొక్క ప్రధాన లక్షణం పోలిక అని,కవిత్వం అనేది సాధారణంగా ఆది నుండి నేటి వరకు పోలికను ప్రధాన అంశంగా తీసుకుంటూ కవులందరూ కూడా వివిధ రకాల ప్రక్రియలలో విలక్షణమైన ప్రతీకలతో ,విభిన్నమైన సృజనాలతో అభివ్యక్తీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు .
అంతేకాక కవిత్వం ఒక ప్రజాస్వామీకం అంటూ ఆయన చేసిన సాహితీ ప్రసంగం ఆద్యంతం ఆహుతులను కట్టిపడేసింది.
ప్రస్తుత కవిత్వం పండిత ప్రాంగణం నుంచి పామర ప్రాంగణం వరకు, సంక్లిష్ట ప్రాంగణం నుండి సరళ ప్రాంగణం వరకు ప్రవహిస్తోందని సోదాహరణంగా ఆయన చెప్పారు.

మరియు ప్రస్తుతం పోలిక లేని మరియు పోలికతో ముడిపడని కవిత్వం రావాలని ఆయన ఆకాంక్షిస్తూ వర్ధమాన, ఔత్సాహిక కౌలకు సూచించారు. నేటి కవిత్వపోకడలు ఏకవాక్య కవితలుగా పరిణామం చెందాయని,అవి విస్తృత భావార్ధాన్ని వ్యక్తీకరించుటకు ప్రయత్నం చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు..

తదుపరి శ్రీ ఇనాక్ ప్రసంగంపై ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు శ్రీ మీసాల చినగౌరినాయుడు గారు స్పందిస్తూ
సాహితీ శిఖరంపై యున్న శ్రీ ఇనాక్ గారు తెలుగువెలుగు సాహిత్య వేదికకు విశిష్ట అతిథిగా విచ్చేసి కవిత్వ పరిణామక్రమం,కవిత్వ తీరుతెన్నులు,కవిత్వ పోకడలు,కవిత్వ ప్రక్రియలు,కవితా రూపాలు మున్నగు వాటి గురించి యువకవులకు సూచనాత్మక ఉపన్యాసం గొప్ప స్ఫూర్తినీయంగా,మార్గదర్శనంగా ఉందని తెలియజేసారు.. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు నాళేశ్వరం 
శంకరం  మాట్లాడుతూ ..నన్నయ నుంచి నారాయణ రెడ్డి వరకు కవిత్వంలో ఎన్నో కొత్త ధోరణులు వచ్చాయన్నారు. నన్నయ, తిక్కన ,ఎర్రాప్రగడ వంటి మహాకవులు అక్షర రమ్యత, నానారుచి, నవ్యత,ప్రసన్నత వంటి విభిన్న విలక్షణమైన పద సౌందర్యంతో రచనలు చేశారన్నారు. రామాయణాలను ఎందరో లబ్ధప్రతిష్ఠులైన కవులు వ్రాసినప్పటికీ వాల్మీకి రామాయణం స్ఫురణకు వస్తుందన్నారు.  పద్యానికి, గేయానికి, కవిత్వానికి  ఉన్నవిభిన్న పద్దతులను వారు వివరించారు. ఈ సందర్భంగా తెలుగు వెలుగు సాహిత్య వేదిక జాతీయ గౌరవ అధ్యక్షులు గంట మనోహర్ రెడ్డి మాట్లాడుతూ .. తెలుగు వెలుగు సాహిత్య వేదిక చేస్తున్న సాహిత్య సేవలను కొనియాడారు..
ఈ కార్యక్రమానికి కీలక ఉపన్యాసం మరియు సమీక్షలు కిలపర్తి దారి నాయుడు మాస్టారు మాట్లాడుతూ..  సాహిత్య  రసరమ్యతను చాటిచెప్పడంలో  ఎందరో ప్రాచీన కవుల నుంచి నేటి ఆధునిక కవుల వరకు చేస్తున్న సాహిత్య కృషిని కొనియాడారు.. 
ఈ కార్యక్రమంలో ప్రార్థన గీతం మీనాక్షి చొప్పదండి రాధా ఆలకించారు వేదిక గీతం డాక్టర్ వేద శారదా దేవి సమీక్షకులు 
 మీసాలు చిన్న గౌరి నాయుడు డాక్టర్ బి హెచ్ వి రమాదేవి నవనీత రవీందర్ సమీక్షలు చేయగా సభాధ్యక్షులుగా చొప్పదండి రాధా డాక్టర్ బాలచందర్ సాదే కూనాకు శార్వాణి రజిత ప్రకాష్ ఊటుక రంగారావు సభాధ్యక్షులుగా కొనసాగించారు 
 ఈ కార్యక్రమంలో అతిధుల పరిచయం డాక్టర్ మోటూరు నారాయణరావు తెలిపారు 
 కార్యక్రమానికి ముగింపు పలుకులు మేడిశెట్టి యోగేశ్వరరావు వందన సమస్తము రజిత ప్రకాష్ చేశారని అధ్యక్షుడు మూర్తి తెలిపారు

About The Author: Admin